అనుష్క కి పెళ్లి గఢీయలు దగ్గర పడ్డాయి బెంగుళూరుకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త తో పెళ్ళి వచ్చే సంవత్సరంలో జేజమ్మ పెళ్లి ఖాయమేనా మరి
ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ‘బాహుబలి-ది కన్‌క్లూజన్’ రిలీజ్ కి సిద్ధమవుతోంది. దీంతోపాటు.. ‘భాగమతి’ అనే మరో ప్రతిష్టాత్మక సినిమాలోనూ నటిస్తోంది. దక్షిణాది మీడియా కథనాల ప్రకారం మంగళూరుకు చెందిన అనుష్క 36 ఏళ్ల వయస్సులో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నదని సమాచారం.
నిజానికి అనుష్క పెళ్లి గురించి గతంలో రకరకాల కథనాలు మీడియాలో షికారు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఓ టాలీవుడ్ నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లి గురించి తాజాగా చక్కర్లు కొడుతున్న కథనాలు ఎంతవరకు నిజమన్నది ధ్రువీకరించలేమని టాలీవుడ్ పరిశీలకులు అంటున్నారు.
దక్షిణాదిలో కథానాయికగా ఒక వెలుగు వెలుగుతున్న అనుష్క పెళ్లి వార్తలు నిజమైతే.. వచ్చే ఏడాది సమంత-నాగా చైతన్య పెళ్లితోపాటు ఈ సెలబ్రిటీ వివాహం కూడా వార్తల్లో నిలిచే అవకాశముంది. పెళ్లి తర్వాత అనుష్క సినిమాల్లో నటిస్తుందో లేదోనని ఆమె అభిమానులు మాత్రం ఫుల్లుగా ఫీలవుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లను బట్టి తెలుస్తోంది.
