సౌత్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ రోల్స్ మాత్రమే కాక లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోలతో అనుష్క పోటీ పడింది. బాహుబలి చిత్రంతో అనుష్కకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనుష్క వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్. అయినా కూడా అనుష్క కేంద్రంగా అనేక పుకార్లు వినిపిస్తుంటాయి. అనుష్క ప్రేమ వ్యవహారాల గురించి అనేక ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. ఆ వార్తలన్నింటిని అనుష్క ఖండించింది. 

ఇదిలా ఉండగా తాజాగా తనకు సన్నిహితమైన ఓ వ్యక్తిని గుర్తు చేసుకుంది. రవి అనే వ్యక్తి అనుష్కకు గతంలో అసిస్టెంట్ గా పనిచేశాడు. ఏడేళ్ల క్రితం అతడు చనిపోయాడు. శనివారం రోజు రవి వర్థంతి సంధర్భంగా అనుష్క ఎమోషనల్ అయింది. రవిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మనల్ని ప్రేమించే వ్యక్తులు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళరు. మరణం అందుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి. 

మనకు బాగా చేరువైన వ్యక్తి ఇక మన జీవితంలో లేరు అంటే దానర్థం.. వారు మనజీవితంలో కొత్త భాగాన్ని తీసుకువెళుతున్నట్లు. రవి మరణించి ఏడేళ్లు అవుతుందంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. మరణం తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. కానీ రవి ఎప్పటికి నా హృదయంలో ఉంటాడు అంటూ అనుష్క ఎమోషనల్ గా తన భావాల్ని బయటపెట్టింది.