'బాహుబలి' సినిమాతో ప్రభాస్ ఫాలోయింగ్ ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్ రేంజ్ లో కాకపోయినా.. అనుష్కకి కూడా 'బాహుబలి'తో పాపులారిటీ వచ్చింది. జాతీయ వ్యాప్తంగా అనుష్క కూడా అభిమానులను సంపాదించుకుంది.

'బాహుబలి'తో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రభాస్ 'సాహో' సినిమా చేస్తున్నాడు. తన సొంత బ్యానర్ లాంటిదైన యువి క్రియేషన్స్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి క్రేజ్ బాగానే ఉంది. హాలీవుడ్ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. ప్రభాస్ మాదిరి భారీ సినిమా చేయలేకపోయినా.. అనుష్క కూడా తన తదుపరి సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తోంది.

'సైలెన్స్' పేరుతో తెరకెక్కుతోన్న ఈ థ్రిల్లర్ సినిమా అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందట. 'బాహుబలి' విడుదల కాకముందు వరకు అనుష్కకు తెలుగు, తమిళ  భాషల్లో మంచి మార్కెట్ ఉంది. 'బాహుబలి' రిలీజ్ అయిన తరువాత హిందీలో కూడా ఆమెకి గుర్తింపు రావడంతో ఇప్పుడు తన సినిమాను అక్కడ కూడా రిలీజ్ చేయాలనుకుంటుంది.  

సహజ పద్దతుల్లో బరువు తగ్గి సినిమా కోసం ఎంతో కష్టపడుతుంది. ఇటీవల అమెరికాలో సినిమాషూటింగ్ మొదలైంది. సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మంచి డేట్ చూసుకొని అన్ని భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.