నటులు ఓ స్దాయి వచ్చేవరకూ కమర్షియల్ గా పే ఆఫ్ అయ్యే చిత్రాలు చేసినా ఆ తర్వాత తమలోని నటిని లేదా నటుడుని ఆవిష్కరించే సినిమాలు చేయాలి. లేకపోతే వాళ్లను చరిత్ర గుర్తించుకోదు.  ఇదే విషయాన్ని బుర్రకు ఎక్కించుకుది అనుష్క. కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ చేసిన ఆమె మెల్లిగా నటిగా పేరు తెచ్చి పెట్టే సినిమాలు ఓకే చేస్తోంది. 

ముఖ్యంగా భాగమతి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నది అనుష్క. డిఫరెంట్ గా ఉండే కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న ఆమె త్వరలో  ఓ సినిమాలో అంధురాలిగా కనిపించనుందని సమాచారం. రీసెంట్ గా ఆమె కమిటైన  ఓ స్పానిష్ రీమేక్‌ లో ఆమె పాత్ర అది.  తాల్, ఆప్నే, పరదేశ్ సినిమాలతో సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న   కబీర్‌లాల్ ఈ సినిమాతో డైరక్టర్ గా పరిచయం కాబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 

స్పానిష్ చిత్రం జూలియాస్ ఐస్ ఆధారంగా హారర్ థ్రిల్లర్‌గా ఓ సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన కవల సోదరి హత్య వెనకున్న రహస్యాల్ని ఛేదించే క్రమంలో అంధురాలైన ఓ యువతికి ఎదురయ్యే సంఘటనలతో ఈ సినిమా కథ సాగుతుంది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందనున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్  అయితే బాగుంటుందని కబీర్‌లాల్ భావించి ఆమెను ఎంపిక చేసినట్లు తెలిసింది.

తెలుగు, తమిళ భాషల్లో ఆమెకున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు నిర్మాతలు ఆమెను ఓకే చేసినట్లు తెలిసింది. అనుష్క త్వరలో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తున్నది.