అనుష్కతో ఎన్ని సినిమాలైనా చేస్తానన్న ప్రభాస్ బిల్లా టు ా బాహుబలి పర్ ఫెక్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జోడీ సాహోలోనూ మళ్లీ అనుష్కనే ప్రభాస్ హీరోయిన్
అనుష్కతో ఎన్ని సినిమాలైనా చేస్తా.. తనతో ఉండే కంఫర్టే వేరు అంటూ 'మిర్చి' సందర్భంగా స్టేట్మెంట్ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... అన్న మాట ప్రకారమే అనుష్కతో వీలైనన్ని సినిమాలు చేస్తూ పోతున్నాడు. 'మిర్చి' తర్వాత 'బాహుబలి' కోసం అనుష్కతోనే జోడీ కట్టిన ప్రభాస్.. దాదాపుగా ఐదేళ్ల నుంచి అనుష్కతో కలిసి పని చేస్తున్నాడు.
ఈ ఏడాది కూడా అనుష్కతోనే కొనసాగబోతున్నాడు ప్రభాస్. కొత్త సినిమా 'సాహో'లోనూ అనుష్కే హీరోయిన్ అని తెలుస్తోంది. బాలీవుడ్ భామలను సంప్రదించినప్పుడు.. రెమ్యునరేషన్ తదితర విషయాల్లో బీటౌన్ బేబీస్ పెట్టిన కండిషన్లు నిర్మాతలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ చేయడంతో... మళ్లీ సూపర్ హిట్ పెయిర్ గా ఉన్న అనుష్క-ప్రభాస్ జోడీనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. 'సాహో' హీరోయిన్ అనుష్కనే అని చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి.
తొలిసారి 'బిల్లా'తో జోడీ కట్టిన ప్రభాస్-అనుష్కలకు 'సాహో' నాలుగో సినిమా అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న 'సాహో' కోసం నేషనల్ వైడ్ ఫేమ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్ని తీసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం చాలా పేర్లను పరిశీలించారు కానీ.. చివరికి అనుష్క అయితే అన్ని రకాలుగా ఓకే అనుకుని ఆమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
దక్షిణాదిన ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. 'బాహుబలి'తో ఉత్తరాది ప్రేక్షకులకూ చేరువైన అనుష్కతో ప్రభాస్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉండటం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. 'సాహో' షూటింగ్ గురువారమే హైదరాబాద్‌లోని సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైనట్లు సమాచారం. తర్వాత రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ ఉంటుందని తెలిసింది. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సాహో చిత్రాన్ని 'యువి క్రియేషన్స్' నిర్మిస్తోంది.
