Asianet News TeluguAsianet News Telugu

'ఇదే నా లాస్ట్ ట్వీట్!' .. ట్విట్టర్ కు బై చెప్పిన స్టార్ డైరెక్టర్ !

సామాజిక సినిమాల దర్శకుడు అనురాగ్‌ కశ్యప్ వ్యక్తిగతంగానూ  సామజిక అంశాల పై తనదైన శైలిలో స్పందిస్తూంటారు.. భిన్నమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తూంటారు. అలాగే  ఈ మధ్యనే  అనురాగ్‌ కశ్యప్‌ రాజకీయ అంశాల పై కూడా తన శైలి వ్యాఖ్యలు చేసి.. చాలాసార్లు వివాదాస్పదంగా కూడా మారారు.

Anurag Kashyap quits Twitter after family gets threats online
Author
Hyderabad, First Published Aug 12, 2019, 1:27 PM IST

ప్రముఖ బాలీవుడ్‌ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి తప్పుకోవటం జరిగింది. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన సొంత అభిప్రాయాలు వెల్లడిస్తున్నందున తన కుటుంబంపై కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని అని అందుకు కారణంగా పేర్కొన్నారు. ఈ మేరకు  ఆయన రెండు ట్వీట్లు చేసి.. ఇవే నా చివరి ట్వీట్లు అని బై చెప్పారు.

సామాజిక సినిమాల దర్శకుడు అనురాగ్‌ కశ్యప్ వ్యక్తిగతంగానూ  సామజిక అంశాల పై తనదైన శైలిలో స్పందిస్తూంటారు.. భిన్నమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తూంటారు. అలాగే  ఈ మధ్యనే  అనురాగ్‌ కశ్యప్‌ రాజకీయ అంశాల పై కూడా తన శైలి వ్యాఖ్యలు చేసి.. చాలాసార్లు వివాదాస్పదంగా కూడా మారారు. శ్రీరామ్‌ నినాదం పేరుతో దేశంలో సంఘ విద్రోహక శక్తులు మూకదాడులు చేస్తూ పెచ్చరిల్లిపోతున్నాయని, దీనిపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ జులై 23వ తేదీన వివిధ రంగాల ప్రముఖులు లేఖ రాసారు.

ఈ లేఖ రాసిన వారిలో అనురాగ్‌ కూడా ఉన్నారు. అక్కడ నుంచే ఈ వివాదం మొదలై, పెద్దదైంది. ఎప్పటిలాగే అనురాగ్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో.. ఆయా పార్టీల అభినానుల చేత సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. తనను ట్రోలింగ్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. అందుకే అనురాగ్ ఈ అంశం పై ట్విటర్ లో పోస్ట్ చేస్తూ… ‘ఆన్‌లైన్‌లో నా తల్లిదండ్రులను, కుమార్తెను బెదిరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

కానీ ఎవ్వరూ దీని గురించి పట్టించుకోవడం లేదు. దేశంలో దోపిడీ దొంగల పాలన నడుస్తోంది. ఈ పాలనకే మనం అలవాటుపడాలి. ఈ నవ భారత్‌లో మీరంతా బతకగలుగుతారని ఆశిస్తున్నాను. నేను ట్విటర్‌ నుంచి తప్పుకొంటున్నాను. ఇదే నా చివరి ట్వీట్‌. ఎలాంటి భయం లేకుండా నా అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం నాకు లేనప్పుడు నేను ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిది. గుడ్‌బై’ అని పేర్కొన్నారు.


 
 

Follow Us:
Download App:
  • android
  • ios