Asianet News TeluguAsianet News Telugu

అనుప‌మ ప్రేమ‌లో ప‌డిందా

  • శతమానం భవతి మూవీ ఫేమ్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ప‌డింద‌ట‌
  • బావామరదళ్ల క్యారేక్ట‌ర్ తో ఎలాంటి సినిమా తీసిన హిట్ అవ్వాల్సిందేటంటున్న ముద్దుగుమ్మ‌
  • అనుపమ కొంపదీసి ఎవరితోనన్నా ప్రేమలో పడిందా ఏమిటి అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి
anupamaparameshwaran likes love storys

 

 ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఫుల్ లెంగ్త్ లో నటించిన సినిమా శతమానం భవతి. ఈ సినిమాలో హీరో శర్వాతో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. అదే అడిగితే బావామరదళ్ల క్యారెక్టర్లు కదా ఆ మాత్రం వర్కవుట్ అవ్వకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నించింది కూడా.

ఇదిలా వుంటే ఈ మలయాళీ అమ్మడు ఇటీవల యూట్యూబ్ లోకి వదిలిన ఓ వీడియో ఇప్పటికి రెండు లక్షలకు పైగా హిట్ లు తెచ్చేసుకుంది. ఇంతకీ ఏమిటీ వీడియో అంటే.. శతమానం భవితిలోని 'నాలో నువ్వు, నీలో నేను' పాటకు డబ్ స్మాష్ అన్నమాట.

 సరే ఆ పాటకు సినిమాలో నటించింది కాబట్టి అలాగే మళ్లీ మరోసారి నటించింది అనుకుంటే పొరపాటే. ఆ పాట, దాని సాహిత్యం, దాని ప్రతిపదార్థం అన్నీ తెలుసుకుని, మనసుతో స్పందించి, మొహంలోకి ఆ భావాలు అన్నీ తీసుకువచ్చి మరీ వీడియో చేసింది. ఇది చూసిన అందరూ అనుపమ కొంపదీసి ఎవరితోనన్నా ప్రేమలో పడిందా ఏమిటి? ఇంతలా ఫీలైపోతోంది అని గుసగుసలు పోతున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios