హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కొత్త యాడ్ ఫిల్మ్ లో మెరిసిపోతోంది. పట్టుచీర, అట్రాక్టివ్ జూవెల్లరీలో అచ్చు లక్ష్మిదేవిలా కనిపిస్తోంది. కండ్ల ముందే దేవత తిరుగుతున్న అనుభూతిని కలిగించే యాడ్ ఫిల్మ్ నెట్టింట వైరల్ అవుతోంది.

కేరళ కుట్టి, టాలీవుడ్ హీరోయిన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది. అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమె క్యూట్ లుక్స్ యువతని ఎంతగానో ఆకట్టుకున్నాయి. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ అందం, అభినయం ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. 

ఇదిలా ఉండగా అనుపమ అటు చిత్రాలతో పాటు యాడ్ ఫిల్మ్ లోనూ నటిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తున్న అనుమ క్రేజ్, పాపులారిటీని గుర్తించి పలు సంస్థలు ఈ బ్యూటీని బ్రాండ్ అబాసిడర్ గా ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ యాడ్ ఫిల్మ్ లో నటించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యువ పారిశ్రామికవేత్త ఉదయ్ సాయి స్థాపించిన ‘గౌరీ సిగ్నేచర్’ (Gowri Signatures) సంస్థ హైదరాబాద్ లో తమ మరో బ్రాంచ్ ను ఓపెన్ చేయనుంది. ఇందుకు గాను బ్రాండ్ అబాసిడర్ గా హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ను ఎంచుకుంది. ఈ మేరకు పబ్లిసిటీలో భాగంగా అనుపమాతో యాడ్ ఫిల్మ్ రూపొందించారు. ప్రస్తుతం ఈ యాడ్ ఫిల్మ్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. 

అప్పటికీ క్యూట్ లుక్స్, గ్లామర్ కలిగి ఉన్న అనుపమ గౌరీ సిల్క్స్ వారి సంప్రదాయ దుస్తులు మరింత మెరిసిపోతోంది. గోల్డ్ కలర్ శారీ, లంగావోణి, జూవెల్లరీలో అనుపమ మెరిసిపోతోంది. ముఖ్యంగా యువతులను సంప్రదాయ దుస్తులవైపు మళ్లించేలా ఉన్న ఈ యాడ్ ఫిల్మ్ ను అనుపమ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. నాలుగు లక్షలకు పైగా నెటిజన్లు లైక్ చేశారు. గౌరీ సిల్క్స్ అనేది సాంప్రదాయ చేనేత కార్మికులు రూపొందించిన పట్టు చీరల నిధి. బ్రాండ్ గౌరీ ద్వారా, హ్యాండ్ క్రాఫ్టింగ్‌లోని పురాతన కళారూపాన్ని దాని వైభవంగా మరియు అద్భుతంగా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది. సిల్క్, పట్లు చీరలను హైదరాబాద్, నైజాంలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 

View post on Instagram

అనుపమ ఈ ఏడాది రౌడీ బాయ్స్ తో ప్రేక్షకులను అలరించగా, ప్రస్తుతం థ్రిల్లర్ మూవీ ‘బటర్ ఫ్లై’లో నటిస్తోంది. మరోవైపు నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘కార్తీకేయ 2’, ‘18 పేజెస్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే ‘హెలెన్’అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది అనుపమ. మొత్తంగా టాలీవుడ్ లో బిజియేస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.