అనుపమా పరమేశ్వరన్ కరోనా బారిన పడటం గమనార్హం. జలుబుఉ, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతున్న అనుపమా టెస్ట్ చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా తేలిందట.
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. నెమ్మదిగా అది విస్తరిస్తుంది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా అనుపమా పరమేశ్వరన్ కరోనా బారిన పడటం గమనార్హం. జలుబుఉ, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతున్న అనుపమా టెస్ట్ చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా తేలిందట(సాక్షి, జీ తెలుగు కథనాల ప్రకారం). దీంతో ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండిపోయింది.
ఇదిలా ఉంటే ఇటీవల దేశ వ్యాప్తంగా తిరిగింది అనుపమా. తాను నటించిన `కార్తికేయ 2` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇండియాలోని ప్రధాన నగరాలను చుట్టేసింది. సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ఆమె ప్రమోషన్‌లో పాల్గొని సందడి చేసింది. హీరో నిఖిల్‌తోపాటు తను భాగమై ప్రమోషన్ పెంచడంలో కీలక భూమిక పోషించింది. ఈ క్రమంలోనే ఆమెకి కరోనా సోకి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటికే మూడు వేవ్స్ లో అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అందులో కొందరు కన్నుమూశారు.
ఇటీవల విడుదలైన `కార్తికేయ 2` సంచలన విజయం సాధించిన విషయం విషయం తెలిసిందే. సూపర్ హిట్‌గా నిలిచిన `కార్తికేయ`కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. అభిషేన్ అగర్వాల్ నిర్మించారు. ఆగస్ట్ 13న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.
మరోవైపు అనుపమా పరమేశ్వరన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. నిఖిల్‌తోనే `18పేజెస్` సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. దీంతోపాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రం `బటర్‌ఫై` చేస్తుంది. అలాగే రెజీనాతో కలిసి మరో బైలింగ్వల్ మూవీ చేస్తుంది అనుపమా పరమేశ్వరన్.
