Asianet News TeluguAsianet News Telugu

అనుపమా పరమేశ్వరన్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ సందడి.. `18పేజెస్‌` వచ్చేది అప్పుడే

ప్రస్తుతం ఈ మూడు తెలుగు సినిమాలతో సక్సెస్‌ సాధించి తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది అనుపమా. అంతేకాదు బ్యాక్‌ టూ బ్యాక్‌ తెలుగు ఆడియెన్స్ ని తన అందాలతో కట్టిపడేయబోతుంది.

anupama parameswaran nikhil starrer 18 pages release date
Author
Hyderabad, First Published Nov 14, 2021, 2:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అనుపమా పరమేశ్వరన్‌(Anupama Parameswaran).. క్యూట్‌ అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో తన కవ్వించే పిక్స్ ని పంచుకుని నెటిజన్లకి గిలిగింతలు పెడుతుంది. ఫ్యాన్స్ ని మెస్మరైజ్‌ చేస్తుంది. ఓ వైపు తన గ్లామర్‌ షోతో మేకర్స్ కి ఎరవేస్తున్న ఈ అందాల భామ మరోవైపు వరుసగా సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఆమె తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి `18 పేజెస్‌`(18 Pages). నిఖిల్‌ సిద్ధార్థ్‌(Nikhil)తో కలిసి నటిస్తున్న చిత్రమిది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. 

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర‌ప్ప‌ణ‌లో యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, గార్జీయ‌స్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన క‌థ‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వంలో సిద్ధం అవుతున్న మూవీ `18 పేజీస్`. `100 ప‌ర్సెంట్ ల‌వ్`, `భ‌లే భ‌లే మ‌గాడివోయ్`, `పిల్లానువ్వ‌లేని జీవితం`, `గీత గోవిందం`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్ని నిర్మించిన జీఏ2పిక్చ‌ర్స్ - `కుమారి 21 ఎఫ్ ` వంటి సూప‌ర్ హిట్ సినిమాను నిర్మించిన సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ `18 పేజీస్` చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా అంద‌రి మ‌న్న‌నులు అందుకుంటున్న బ‌న్నీ వాసు ఈ చిత్రానికి నిర్మిత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

ఇప్ప‌టికే విడుద‌లైన 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లకు అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో 18 పేజీస్ విడుద‌ల తేదిని నిర్మాత బ‌న్నీ వాసు ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ రేంజ్ లో ఫిబ్ర‌వ‌రి 18, 2022న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా బ‌న్నీవాసు తెలిపారు. స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. `కుమారి 21 ఎఫ్` తో యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ గుర్తింపు తెచ్చుకున్న ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ `18 పేజీస్` ని కూడా వినూత్నంగా తెర‌కెక్కిస్తున్నారు. న‌వీన్ నూలీ ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్య‌వ‌హిర‌స్తున్నారు, ఏ వ‌సంత్ సినిమాటోగ్ర‌ఫి అందిస్తున్నారు, బాబు కో ప్రొడ్యూస‌ర్. ఈ చిత్రానికి సంబంధించిన‌ మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవనున్నాయి.

ఇదిలా ఉంటే `కుమారి 21ఎఫ్‌` చిత్రంతో సక్సెస్‌ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్‌ డైరెక్షన్‌లో, సుకుమార్‌ రైటింగ్స్ లో, గీతా ఆర్ట్స్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం యూత్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాతోపాటు మరో తెలుగు సినిమా చేస్తుంది అనుపమా పరమేశ్వరన్‌.. నిఖిల్‌తోనే `కార్తికేయ2`లోనూ నటిస్తుంది. అలాగే `రౌడీ బాయ్స్ `లోనూ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఈ మూడు తెలుగు సినిమాలతో సక్సెస్‌ సాధించి తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది అనుపమా. అంతేకాదు బ్యాక్‌ టూ బ్యాక్‌ తెలుగు ఆడియెన్స్ ని తన అందాలతో కట్టిపడేయబోతుంది.

also read: Pooja Hegde: మాల్దీవుల్లో తన గది చూపిస్తూ పూజా హెగ్డే రచ్చ.. వాటికోసం అభిమానులు ఎదురుచూపులు..
 

Follow Us:
Download App:
  • android
  • ios