డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. 

డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా అనే సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి కూడా ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గదు అని భరోసా చిత్ర యూనిట్ ఇస్తోంది.

డీజే టిల్లులో సిద్దు, నేహా శెట్టి మధ్య రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. టిల్లు స్క్వేర్ లో అంతకి మించేలా అనుపమ, సిద్దు రెచ్చిపోతున్నారు. అసలు అనుపమ నుంచి ఈ రేంజ్ బోల్డ్ ట్రాన్స్ ఫర్మేషన్ అసలు ఊహించం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలవుతున్న తరుణంలో టిల్లు స్క్వేర్ టీమ్ అభిమానులకు విషెష్ తెలుపుతూ ఒక బోల్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఈ పోస్టర్ లో అనుపమ, సిద్దు జొన్నలగడ్డ రొమాంటిక్ ఫోజు చూస్తే కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఆ రేంజ్ లో హీటెక్కించేలా ఈ పోస్టర్ ఉంది. కాస్త అసభ్యంగా కూడా ఉన్నపటికీ యువత మాత్రం ఫిదా అవుతున్నారు. పోస్టర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో అని అంతా షాక్ అవుతున్నారు. 

Scroll to load tweet…

ఈ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉన్నాయట. ఆల్రెడీ అనుపమ రౌడీ బాయ్స్ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.