వచ్చినట్టే వచ్చి రామ్ చరణ్, సుకుమార్ మూవీ హీరోయిన్ గా చేజారిన ఆఫర్ అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో మరో మంచి అవకాశం అఖిల్ సరసన హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసిన అనుపమ

ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లలో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ మధ్యనే కాంపిటిషన్. ఇద్దరూ పక్కింటమ్మాయిల్లా ఉంటూ అందం, అభినయం రెండూ కలగలిపిన అమ్మాయిల్లా ఉంటారు. ఇద్దరూ దక్షిణాది హీరోయిన్లు కావటంతో తెలుగు ప్రేక్షకులకు అనతి కాలంలోనే దగ్గరయ్యారు. వీరిల ో కీర్తి సురేష్ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. అయితే.. వరుస హిట్లు ఇచ్చినా.. అనుపమా పరమేశ్వరన్ కు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

సుకుమార్‌ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ని తీసుకుని తర్వాత ఎందుకు తప్పించారో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. పల్లెటూరి కథ కనుక అనుపమ అయితే బాగుంటుందని ఏరి కోరి ఆమెతో సంతకం చేయించుకుని, అడ్వాన్స్‌ కూడా ఇచ్చేసారు. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో ఆమె స్థానంలో సమంతని తీసుకుంటున్నట్టు చెప్పారు. చరణ్‌ పక్కన అనుపమ చిన్న పిల్లలా వుందంటూ ఒక లీక్ మీడియాకి వదిలారు. ఎలాగైతేనేం ఆ చిత్రాన్ని చేజార్చుకున్న అనుపమకి మరో భారీ చిత్రంలో అవకాశం వచ్చిందంటూ వార్తలొస్తున్నాయి.

అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో అనుపమను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇప్పటికే నాగచైతన్యతో ప్రేమమ్‌ చేసిన అనుపమ ఇప్పుడు అతని తమ్ముడితోను రొమాన్స్‌ చేయనుందన్నమాట. విక్రమ్‌ కుమార్‌ సినిమాలంటేనే వైవిధ్యభరితంగా వుంటాయి కనుక అనుపమ చేతిలో మరో మంచి ప్రాజెక్ట్‌ వున్నట్టే అనుకోవాలి.

అఖిల్ కోసం రాసిన చిత్రానికి ముందుగా అనుకున్న కథ సరిగా లేదని అనుకున్న నేపథ్యంలో.. అఖిల్ కోసం విక్రమ్‌ కుమార్‌ ఒక కొత్త కథ రాసాడని, ఇది కూడా మనం మాదిరిగా స్పెషల్‌ సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.