ఇంస్టాగ్రామ్ లో అనుపమ్ ఖేర్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అనుపమ్ తల్లి మూడు దశాబ్దాల క్రితం తన కుటుంబంలో మతం కారణం కారణంగా జరిగిన ఓ దుర్ఘటన గురించి తెలియజేశారు.
అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files)భారీ సక్సెస్ అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అయితే కాశ్మీర్ లోని హిందూ పండిట్స్ పట్ల ముస్లింల వివక్షత ఆధారంగా తెరక్కడంతో ఈ మూవీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ప్రధాని పీఎం మోడీ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్ ని అభినందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పాత్ర చేసిన అనుపమ్ ఖేర్.. తన తల్లి దులారి చెప్పిన కొన్ని భయానక సంఘటనలకు సంబంధించిన వీడియో షేర్ చేశారు. తన కుటుంబంలోని కొందరు సభ్యులు కూడా సినిమాలో చెప్పిన ఈతి బాధలను అనుభవించినవారే అని ఆమె తెలియజేశారు.
అనుపమ్ ఖేర్ (Anupam Kher)తల్లి దులారి మాట్లాడుతూ "నా సోదరుడు రాంబాగ్‌లో నివసించేవాడు. తను ఒక సాయంత్ర్రం ఇంటికి వచ్చే నాటికి ఇంటిని వదిలి పోవాలని ఓ లేఖ ఉంది. '.ఆ ఏడాదే తన ఇంటిని కట్టుకున్నాడు.. నేనూ, నా మరో తమ్ముడు కూడా అక్కడికి వెళ్లాలని వాళ్లు అనుకున్నారు.. ఆస్తి పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్ కూడా తీసుకోలేదు.. తాను కట్టుకున్న ఇంటికి దూరంగా ఉండటంతో గుండె పగిలి చనిపోయాడు'' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇంస్టాగ్రామ్ లో అనుపమ్ ఖేర్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అనుపమ్ తల్లి మూడు దశాబ్దాల క్రితం తన కుటుంబంలో మతం కారణం కారణంగా జరిగిన ఓ దుర్ఘటన గురించి తెలియజేశారు. అయితే కాశ్మీర్ ఫైల్స్ మూవీపై మరోవైపు వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ మూవీని వాడుకుంటున్నారని కొందరు వాదిస్తున్నారు. అదే సమయంలో కాశ్మీర్ లో ముస్లింలపై జరిగిన అరాచకాల గురించి బయటపెట్టాలని, దానిపై కూడా సినిమా తీయాలి అంటున్నారు.
