Asianet News TeluguAsianet News Telugu

రాజ్ తరణ్ "అనుభవించు రాజా" రిలీజ్ డేట్ ఫిక్స్

రిలీజ్ కు ముందు,వెనక రెండు వారాలు పాటు పెద్దగా కాంపిటేషన్ లేకపోవటం కలిసొచ్చే అంశం ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ మంచి హిట్టైంది. "రాజు వెడలె రవితేజములలరగ .. నారీ మణుల కళ్లు చెదరగ .. వైరి వీరుల గుండెలదరగా" అంటూ ఈ పాట సాగుతోంది.

Anubhavinchu Raja Seals Its Release Date
Author
Hyderabad, First Published Oct 31, 2021, 12:33 PM IST


రీసెంట్ గా "పవర్ ప్లే" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్  హీరో రాజ్ తరుణ్ ఆ సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. తాజాగా ఇప్పుడు "అనుభవించు రాజా" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతున్నారు. శ్రీనివాస్ గావిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో అజయ్, కృష్ణ మురళి పోసాని, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుదర్శన్, అరియానా మరియు ఆదర్శ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్  కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. టీజర్ చూస్తే ఈ సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో ఫుల్ ఫన్ తో  సాగుతుందని అర్థమవుతుంది.  తాజాగా  ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.

నవంబర్ 26న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ కు ముందు,వెనక రెండు వారాలు పాటు పెద్దగా కాంపిటేషన్ లేకపోవటం కలిసొచ్చే అంశం ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ మంచి హిట్టైంది. "రాజు వెడలె రవితేజములలరగ .. నారీ మణుల కళ్లు చెదరగ .. వైరి వీరుల గుండెలదరగా" అంటూ ఈ పాట సాగుతోంది.

"అనుభవించడానికే పుట్టిన అపరభోగరాయ .. కల్లుకైనా కనికరించవా .. మందుకైనా మన్నించవా" అంటూ ఈ పాట ద్వారా హీరో పాత్ర తీరు తెన్నులు చెప్పే ప్రయత్నం చేశారు. మొలతాడైనా మనతో రాదు .. అవకాశం ఉన్నప్పుడే అన్నీ అనుభవించేయ్ అంటూ భాస్కరభట్ల అందించిన సాహిత్యాన్ని రామ్ మిరియాల ఆలపించాడు.  గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే వినోదాత్మక కథ ఇది. రాజ్‌తరుణ్‌ సరసన కషికా ఖాన్‌ నటిస్తోంది.  పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్‌ నరేన్, అజయ్,సుదర్శన్, టెంపర్‌ వంశీ, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్‌ రాజు, అరియానా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నగేశ్‌ బానెల్, సంగీతం: గోపీసుందర్‌.అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios