Asianet News TeluguAsianet News Telugu

కొత్త వివాదంలో విజయ్ చిత్రం.. ముదిరితే కష్టమే?

తమిళ రాజకీయాలపై ఏ హీరో సెటైర్స్ వేయని విధంగా విజయ్ తన ప్రతి చిత్రంలో వివరిస్తూ వస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి డైరెక్ట్ గా నాయకులను టార్గెట్ చేయడం వివాదస్పదంగా మారుతోంది. సర్కార్ సినిమాలో విజయ్ ఏ విధంగా బాణాలను సంధించాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

anthoter contrversial news on vijay mersal movie
Author
Hyderabad, First Published Nov 16, 2018, 7:53 PM IST

గతంలో వచ్చిన మెర్శల్ సినిమా కూడా డైరెక్ట్ గా భారత జనతా పార్టీకి కౌంటర్ ఇచ్చే విధంగా చూపించారు. అయితే ఆ సినిమాకు సంబందించిన మరో వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తేడా వస్తే అదికూడా వైరల్ అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. మెర్శల్ సినిమాలో విజయ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. 

అయితే అందులో విజయ్ మెజీషియన్ పాత్ర కోసం ట్రిక్స్ నేర్చుకోవడానికి ఒక ప్రొఫెషినల్ మెజీషియన్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. కెనడా కు చెందిన రామన్ శర్మ వద్ద విజయ్ చాలా రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే అతనికి రెమ్యునరేషన్ కూడా ఇస్తామని ప్రొడక్షన్ సంస్థ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు రామన్ శర్మ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మెర్షల్ పారితోషికం ఇంకా అందలేదు. ప్రొడక్షన్ హౌస్ కి సందేశాన్ని పంపగా త్వరలోనే ఇస్తామని చెప్పారని వివరిస్తూ.. ఒక వీడియోను పోస్ట్ చేశాడు. 

సినిమా విడుదలై విజయం సాధించి ఏడాదికావొస్తున్న ఇంకా చిన్నపాటి రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం దారుణమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రామన్ వీడియో పోస్ట్ చేసి చిత్ర నిర్మాణ సంస్థకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని అర్ధమవుతోంది. మరి విషయం మరింత వైరల్ అవ్వకముందే నిర్మాత ఆ వ్యక్తికి రెమ్యునరేషన్ ఇస్తారో లేదో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios