వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. అంతరిక్ష నేపధ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై  సినిమాపై అంచనాలను పెంచేసింది. లావణ్య త్రిపాఠి, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్, అదితిరావు వ్యోమగాములుగా కనిపించనున్నారు. ఈరోజు దీపావళి సంధర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్,  లావణ్య త్రిపాఠి సంప్రదాయ గెటప్ లో దర్శనమిచ్చారు.

వరుణ్ తేజ్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాలో హుందాగా కనిపిస్తే.. లావణ్య లంగావోణీలో అందంగా కనిపిస్తోంది. ఈ సినిమాను డిసంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఈ సినిమా పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది. జీరో గ్రావిటీ సెట్ లో ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం. ప్రముఖ హాలీవుడ్ నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.