నేచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను దక్కిచుకుంది. టఫ్ సిట్యుయేషన్ లోనూ మూవీ మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది.
నేచురల్ స్టార్ నాని (Nani), మలయాళం బ్యూటీ నజ్రియా ఫహద్ (Nazriya Fahad) జంటగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఫ్యామిలీ ఆడియెన్స్ పై ఫోకస్ చేసిన నాని ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తో కాస్తా మెప్పిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 10న రిలీజ్ అయ్యింది. మూవీ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. హీరో నాని సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. టక్ జగదీష్, వి, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
‘శ్యామ్ సింగరాయ్’తో మెప్పించినా... భలే భలే మగాడివోయ్ తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదనే చెప్పాలి. కానీ తాజాగా రిలీజ్ అయిన చిత్రం ‘అంటే సుందరానికీ’తో నాని ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాడు. వారం రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.32 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తాజాగా లెక్కల ప్రకారం.. 7వ రోజున తెలుగు వెర్షన్ లో రూ. 65 లక్షలకు పైగా వసూలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.95 లక్షలకు (గ్రాస్) దగ్గరగా ఉన్నట్లు తాజా లెక్కలు నివేదిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ‘అంటే సుందరానికీ’ హవా యూఎస్ లో మాత్రం జోరుగా ఉంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు వన్ మిలియన్ డాలర్స్ మసూళ్ల మార్క్ కు దగ్గరలో ఉంది. రెండు రోజుల్లో 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అయితే మన టాలీవుడ్ నుంచి అత్యధికంగా 1 మిలియన్ డాలర్ సినిమాలు ఉన్న హీరోగా నాని మరో రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. ‘అంటే సుందరానికీ’ చిత్రం యూస్ లో వన్ మిలియన్ డాలర్ ను రీచ్ అయితే ఈ రికార్డులో నాని ఐదో స్థానాన్ని దక్కించుకోనున్నాడు. దీంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీ అవుతోంది.
అంటే సుందరానికీలో.. నాని సుందర ప్రసాద్ అనే పాత్ర పోషించాడు. నాని సరసన హీరోయిన్ నజ్రియా ఫహద్ (Nazriya Fahad) ఆడిపాడింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం నాని దసరా మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ చిత్రంలో నానికి జోడీగా హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. వీరి పేయిర్ లో ఇది రెండో సినిమా కావడం విశేషం. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ రూపుదిద్దుకుంటోంది.
