ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ గా దీన్ని రూపొందించారు.   ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్, తాజాగా విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. 


నాచురల్ స్టార్ నాని గత సంవత్సరం ‘శ్యామ్ సింగరాయ్’ తో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఫ్లాఫ్ అనిపించుకున్నాయి. ఇప్పుడు నాని నటిస్తోన్న మరో సినిమా అంటే సుందరానికి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల అయ్యింది. ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ గా దీన్ని రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్, తాజాగా విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ (3 రోజుల్లో) వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం - 4.35 కోట్లు

సీడెడ్ - 1.10 కోట్లు

యూఏ - 1.15 కోట్లు

గుంటూరు - 0.79 కోట్లు

ఈస్ట్ - 0.76 కోట్లు

వెస్ట్ - 0.66 కోట్లు

కృష్ణా - 0.74 కోట్లు

నెల్లూరు - 0.33 కోట్లు

AP/TS మొత్తం - 9.88 కోట్లు

రెస్టాఫ్ ఇండియా - 1.30 కోట్లు

ఓవర్ సీస్ - 3.90 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ - 15.08 కోట్లు

 ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్‌గా చేసారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. రన్ టైమ్‌ను 2 గంట‌ల 56 నిమిషాలు కావటంతో నెగిటివ్ కామెంట్స్ వినపడ్డాయి. చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేసారు.