తెలుగులో ఇదొక కొత్త తరహా చిత్రం కావటంతో ఓపినింగ్స్ అదిరిపోతాయనటంలో సందేహం లేదు. ఇధి నిర్మాతకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ఈ సినిమా చూడమని తల్లి తండ్రులే పిల్లలను ప్రోత్సహిస్తారు. ఎందుకంటే స్పేస్ కు సంభందించిన నాలెడ్జ్ గెయిన్ అవుతుందని. అదొక ప్లస్ పాయింట్ ఈ సినిమాకు. 

ఇక వరణ్ తేజ విషయానికి వస్తే.. ఈ సినిమా ద్వారా వరుణ్  కు ఓ కొత్త మార్కెట్ పరిచయం కాబోతోంది. అదే బాలీవుడ్ మార్కెట్.  యస్ ..‘ఘాజీ’ చిత్రంతో  సూపర్ సక్సెస్  సాధించిన  సంకల్ప్‌రెడ్డి మరోసారి ఓ కొత్త తరహా చిత్రంతో రాబోతున్నారదే బాలీవుడ్ ని ఆకర్షించే విషయం.   ఘాజీ చిత్రం హిందీలోనూ బాగానే వర్కవుట్ అయ్యింది. రానా హీరో కావటంతో అక్కడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు లేకపోయినా ఘాజీ దర్శకుడి తదుపరి చిత్రం అనేదే సినిమాకు జనాలని లాక్కొచ్చే అంశం. 

అలాగే అక్కడ మార్కెట్లో క్రిష్ కు మంచి పేరు ఉంది. అక్షయ్ కుమార్ తో ఓ సినిమా, కంగనా రనత్ తో ఓ సినిమా చేసిన దర్శకుడుగా బాలీవుడ్ గుర్తుపెట్టుకుంటోంది. వీటికి తోడు బాలీవుడ్ కు బాగా పరిచయం ఉన్న అదితిరావు హైదరీ కూడా ఈ సినిమాకు బాలీవుడ్ ప్రమోషన్ తెచ్చే పెట్టే విషయమే. దాంతో ఈ చిత్రం హిందీ వెర్షన్ సైతం ఖచ్చితంగా మంచి బిజినెస్ చేస్తుంది. అలాగే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది కనుక బాలీవుడ్ లో హిట్ అయితే వరుణ్ తేజ కు కొత్త మార్కెట్ ఓపెన్ అయ్యినట్లే కదా. 

హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘అంతరిక్షం’ ఉండబోతుందని ఈ ట్రైలర్ ని చూస్తే అర్దమవుతోంది.  జీరో డార్క్, గేమ్ ఆప్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం మరో విశేషం. 

దేవ్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ క‌నిపించ‌నుండ‌గా, రియా పాత్ర‌లో అదితి రావు హైద‌రి, పార్వ‌తి పాత్ర‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌నిపించ‌నుంది. ప్రశాంత్ ఆర్. విహారి చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేయ‌నున్నారు.