టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై రోజు ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. దర్శకుడు క్రిష్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ అనుకుంటున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ లో అతిముఖ్యమైన పాత్ర నాగేశ్వర రావు గారి క్యారెక్టర్. 

ఇప్పటివరకు సుమంత్ చేసిన పాత్రలన్నీ అనుకున్నంత ఆదరణను ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ లో ఆయన చేసే పాత్ర మాత్రం తప్పకుండా కెరీర్ లో నిలిచిపోతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఎందుకంటే సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్ - ఏఎన్నార్ మంచి మిత్రులు. వారు కలిసి చేసిన మల్టి స్టారర్ లు మంచి హిట్ అయ్యాయి. 

ఇకపోతే అక్కినేని గారు ఎనిమిది విభిన్నమైన వేషాలతో కనిపిస్తారని టాక్ వస్తోంది.  ఆయన లైఫ్ ని టర్న్ చేసిన సినిమా గెటప్స్ తో పాటు వివిధ వయసులో ఆయన ఉన్న తీరును క్రిష్ చూపిస్తారని తెలుస్తోంది. మరి ఆ పాత్రలు ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి.