Asianet News TeluguAsianet News Telugu

సినిమా స్టోరీని మించిన సుశాంత్‌ డెత్‌ మిస్టరీ.. తాజాగా మరో ట్విస్ట్

 సుశాంత్‌ కేసుని ముంబయి పోలీసులే కాకుండా అటు బీహార్ పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ సైతం కేసు ఫైల్‌ చేసింది. తాజాగా బీహార్‌ పోలీసులు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

another twist in the sushant singh rajput suicide case
Author
Hyderabad, First Published Aug 3, 2020, 8:44 AM IST

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య రోజుకో మలుపు తిరుగుతుంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సినిమా స్టోరీని తలపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమా కథని మించి రసవత్తరంగా సాగుతుంది. రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సుశాంత్‌ ఆత్మహత్యకు దారి తీసిన అంశాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

ఓ వైపు తన మాజీ ప్రియురాలికి సంబంధించి షాక్‌ విషయాలను బయటపడుతుండగా, మరోవైపు ఆయన జీవితంలోని విషయాలను షాకింగ్‌కి గురిచేస్తున్నారు. సుశాంత్‌ కేసుని ముంబయి పోలీసులే కాకుండా అటు బీహార్ పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసు విషయంలో ఏకంగా బీహార్‌ కి చెందిన పాట్నాసెంట్రల్‌ సిటీ ఎస్పీ వినయ్‌ తివారీ రంగంలోకి దిగారు. తన టీమ్‌తో కలిసి ఆయన ఆదివారం ముంబయి చేరుకున్నారు. ముంబయి పోలీసులతో కలిసి కేసుని ముమ్మరం చేశారు. సుశాంత్‌ ప్రియురాలు రియాపై సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఫిర్యాదు నేపథ్యంలో బీహార్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ సైతం కేసు ఫైల్‌ చేసింది. తాజాగా బీహార్‌ పోలీసులు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుశాంత్‌ వినియోగిస్తున్న మొబైల్‌ సిమ్‌ కార్డులు అతని పేరు మీద లేవని తెలిపారు. గత కొన్ని నెలలుగా వరుసగా సిమ్‌లు మారుస్తున్నట్టు, జూన్‌ 9 నుంచి 13వ తేదీ మధ్యలో సుశాంత్‌ ఏకంగా 14 సిమ్‌లు మార్చినట్టు వెల్లడించారు. 

`సుశాంత్‌ తన పేరుతో ఒక్క సిమ్‌ కార్డుని కూడా వాడలేదు. అన్నీ ఇతరుల పేర్లతో ఉన్నాయి. ఆ సిమ్‌ కార్డుల్లో ఒకటి మాత్రం సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితాని పేరు మీద ఉంది. ప్రస్తుతం కాల్‌ డేటా రికార్డులను పరిశీలిస్తున్నామ`ని  బిహార్‌ పోలీసులు తెలిపారు. మరోవైపు సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశ ఆత్మహత్య కేసుపై కూడా సిట్‌ ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మాజీ మేనేజర్‌ దిశా మరణానికి ముందు సుశాంత్‌కి కొన్ని కీలకమైన సమాచారాన్నిపంచుకున్నట్టు, ఈ కారణంగానే సుశాంత్‌ బెదిరింపులకు గురయ్యాడని, అందుకే సిమ్‌లు మార్చాడని పోలీసులు చెబుతున్నారు. తన రూమ్మేట్‌, ఫ్రెండ్‌ సిద్ధార్థ్ పితాని నుంచి కూడా పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నట్టు తెలిపారు. 

మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని కుటుంబం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి సంబంధించి రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు రియా ఓ అజ్ఞాత ఖాతాకు బదిలీ చేసిందని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు విచారణలో కొత్త ట్విస్ట్ యాడ్‌ అయ్యింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో ముంబైలోని రియా చక్రవర్తి ఇంటికి విచారణ నిమిత్తం బీహార్ పోలీసు బృందం వెళ్లగా అప్పటికే ఆమె ఇంటి నుంచి అదృశ్యమైనట్టు తెలిసింది. 

ఓ జాతీయ టీవీ ఛానల్ రియా ఇల్లు సూపర్‌వైజర్‌ను ఈ విషయమై సంప్రదించగా షాకింగ్ విషయం బయటికొచ్చింది. మూడు రోజుల క్రితం రియా అర్ధరాత్రి తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. బ్లూ కలర్ కారులో వెళ్ళారని, పెద్దపెద్ద సూట్‌కేసులను వెంట తీసుకెళ్లారని తెలిపాడు. రియా ఉంటున్న ఈ ఇంటికి సుశాంత్ ఒకప్పుడు వచ్చాడని చెప్పాడు. మరోవైపు సుశాంత్‌ ఆత్మహత్యకి మాఫియాకి సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా సుశాంత్‌ ఆత్మహత్య కేసు అనేక ట్విస్ట్ లు, టర్న్ లతో రస్తవత్తరంగా మారింది. మరి మున్ముందు ఇంకా ఎన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios