హాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’ నటుడు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ‘టైటానిక్’ నటుడు డేవిడ్ వార్నర్ మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భారతీయ నటులు, హాలీవుడ్ సీనియర్ నటులు ఒక్కొక్కరూ ఈ లోకాన్ని విడిచివెలుతున్నారు. సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన వీరు మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రీసెంట్ గా ప్రముఖ అమెరికన్ నటుడు జేమ్స్ కాన్ (James Cann) 82 ఏండ్ల వయస్సులో అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘టైటానిక్’ (Titanic) చిత్ర నటుడు డేవిడ్ వార్నర్ మృతి చెందడం అందరిని కంటతడి పెట్టిస్తోంది.
ప్రముఖ నటుడు డేవిడ్ వార్నర్ (David Warner) తన 80వ ఏట కన్నుమూశారు. రెండు రోజుల కింద మరణించగా తాజాగా అఫిషియల్స్ గా ప్రకటించారు. ఆయన గత కొద్దికాలంగా క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల వ్యాధి తీవ్రత పెరిగి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించారు. దీంతో ఆయన అభిమానులు, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడి ప్రార్థిస్తున్నారు. డేవిడ్ వార్నర్ 1962 నుంచి హాలీవుడ్ ఫిల్మ్స్ లో నటిస్తూ వచ్చాడు. ‘టైటానిక్’ మూవీలో డేవిడ్ బిల్లీ జేన్ సైడ్ కిక్ స్పైసర్ లవ్ జాయ్ గా నటించాడు. అదేవిధంగా ‘ది ఒమెన్, ట్రాన్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లాండ్ కు చెందిన డేవిడ్ వార్నర్ 1941 జూలై 29న జన్మించాడు. ఈయన పూర్తి పేరు డేవిడ్ హాట్టర్స్లీ వార్నర్. ఈయన రెండు స్టార్లు వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో 1969 -1972 వరకు కలిసి జీవించాడు. రెండో భార్యతో 1981 నుంచి 2002 వరకు కలిసి బతికాడు. ఇటీవల క్యాన్సర్ రావడంతో రిటైర్డ్ యాక్టర్స్, థియేట్రికల్ వర్కర్స్ ఉండే డెన్విల్ హాల్ నివాసంలో ఉన్నాడు. అక్కడే ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. ఈయన చివరిగా ఇంగ్లీష్ ఫిల్మ్ ‘షిల్లింగ్ మరియు సిక్స్‌పెన్స్ ఇన్వెస్టిగేట్’లో నటించారు.
