Asianet News TeluguAsianet News Telugu

రామ్ - బోయపాటి సినిమాలో మరో స్టార్ హీరో.. మల్టీస్టారర్ మూవీనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ స్టార్ కాస్ట్ పై ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
 

Another star hero in Ram Pothineni, Boyapati movie, Interesting update
Author
Hyderabad, First Published Jun 27, 2022, 11:27 AM IST

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా  ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో మూవీ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి  అదిరిపోయే అప్డేట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం స్టార్ కాస్ట్ పై ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే రామ్ మూవీ కోసం బోయపాటి బాలీవుడ్ హీరోయిన్స్ ని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన గ్లామర్ తో పరిణీతి చోప్రా ఎంత క్రేజ్ తెచ్చుకుంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి రామ్ కి మెయిన్ ఫీమేల్ లీడ్ గా పరిణీతితో సంప్రదింపులు జరుపుతున్నారట. దాదాపుగా పరిణీతి ఖరారయ్యే ఛాన్స్ ఉందంటూ అప్పట్లో  వార్తలు వచ్చాయి. తాజాగా మరో క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

యాక్టింగ్, సూపర్ డాన్ష్, హై ఎనర్జి లెవల్స్ ఉన్న రామ్ పోతినేనితో పాటు.. మరో స్టార్ హీరోను కూడా ఈ చిత్రంలో చూపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలుగులో నూ మంచి మార్కెట్ ఉన్న తమిళ స్టార్ శివ కార్తికేయన్ (Siva Karthikeyan)ను తీసుకోకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కించబోతున్నారా అంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. ఏదేమైనా క్రేజీ అప్డేట్స్ తో రామ్- బోయపాటి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.   

పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కెరీర్ కు కావాల్సిన ఊపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బోయపాటి, తమిళ డైరెక్టర్  లింగుస్వామి డైరెక్షన్ లో క్రేజీ ప్రాజెక్ట్ లను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘ది వారియర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ చిత్రం దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చే నెలలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఆ తర్వాత నంబర్ లో బోయపాటితో షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios