కన్నడ సూపర్ స్టార్ యష్ - స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే  ‘కేజీఎఫ్’ టెర్రిటరీలోకి తమిళ స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకోసం అంటే.?

‘కేజీఎఫ్’ ప్రభంజనంతో కన్నడ సూపర్ స్టార్ యశ్ (Yash) దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ ఛాప్టర్ 2తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. మాస్ యాక్షన్ తో ప్రేక్షకులకు ఫిదా చేశారు. ముఖ్యంగా ‘కేజీఎఫ్’ చిత్రంలో యష్ నటించిన ‘రాఖీ బాయ్’ పాత్ర ఆడియెన్స్ కు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. యష్ నటన, మ్యానరిజం, స్టైల్ అన్నీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. 

దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కూడా సరికొత్త కథాంశంతో ఆడియెన్స్ కు న్యూ వరల్డ్ చూపించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన KGF Chapter 1 ఆడియెన్స్ కు ఎంతగానో నచ్చడంతో సీక్వెల్ (KGF Chapter 2) పైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఆ అంచనాలను యష్ - ప్రశాంత్ నీల్ రీచ్ అయ్యారు. ఈ ఫ్రాంచైజీ హిట్ అవడంతో ‘కేజీఎఫ్ ఛాప్టర్ 3’ని కూడా దర్శకుడు ప్రకటించారు. ఛాప్టర్ 2లోనే మూడో భాగంపై హిట్ ఇస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఈక్రమంలో ప్రస్తుతం ప్రేక్షకుల చూపులు KGF3పైనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా రాఖీబాయ్ ఫ్యాన్స్ కు షాకిచ్చే న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

రాఖీబాయ్ ఏలుతున్న ‘కేజీఎఫ్’ లోకేషన్ పై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ‘కేజీఎఫ్’లోని నారాచీలో పాతుకుపోయిన ‘రాఖీబాయ్’ కంటే ముందు అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియని అంశం. అయితే అదే అంశాన్ని టచ్ చేస్తూ తమిళ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ‘కేజీఎఫ్’ టెర్రిటరీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే దర్శకుడు పా. రంజిత్ తో ‘చియాన్61’ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి కూడా వెళ్లనుంది.

దీంతో పా.రంజిత్ విక్రమ్ తో తీయబోతున్న కథ ‘కేజీఎఫ్’ టెర్రిటరీలోనే ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ‘కేజీఎఫ్’లో ఏం జరిగిందని చూపించిన విషయం తెలిసిందే. అయితే పా. రంజిత్ మాత్రం స్వాత్రంత్య్రానికి ముందు అక్కడ ఏం జరగిందనే అంశాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. 18వ శతాబ్దంలో దళితులపై జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘సలార్’, ‘ఎన్టీఆర్ 31’పై ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రాలు పూర్తయ్యాకే ‘కేజీఎఫ్ 3’ని తెరకెక్కించనున్నాడు. ఆలోగా ‘కేజీఎఫ్’లోకి చియాన్ ఎంట్రీ పూర్తవుతుందని తెలుస్తోంది.