బిగ్ బాస్ 3 ఎప్పుడు మొదలవుతుందో గాని ఈ సారి హోస్టింగ్ విషయంలో షో నిర్వాహకులు పెద్ద సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఓ వైపు నాగార్జున ఫిక్స్ అయ్యాడు అని కథనాలు ఓ రేంజ్ లో వస్తుంటే మళ్ళీ ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది. 

మొదటి సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ కి హోస్టింగ్ విషయం పెద్ద తలనొప్పిగా మారుతోంది. షో రేటింగ్ పడి లేచిన కెరటంలో మారుతుంటే బూస్ట్ ఇచ్చే బాహుబలి కావాలని ఎంతో అలోచించి గాని ఒక నిర్ణయానికి రావడం లేదు. నాని దెబ్బకు మరో హీరో అటు వైపు చూడటం లేదు. అనవసరంగా ఆ రచ్చలోకి వెళ్లడం ఎందుకని చాలా మంది నో చెప్పేశారు. 

అయితే ఇప్పుడు నాగార్జున ఒకే చెప్పారు అనుకుంటున్న సమయంలో విజయ్ దేవరకొండ పేరు వినిపించడం గమనార్హం. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్నీ పక్కనపెడితే షో నిర్వాహకులు రౌడీ హీరో గురించి చర్చించారు అనేది వాస్తవం. ఫైనల్ గా ఇందులో ఒక క్లారిటీ రావాలంటే స్టార్ మా ఎనౌన్స్ చేయకపోయినా కనీసం రూమర్స్ పై ఒక క్లారిటీ ఇస్తే జనాల కన్ఫ్యూజన్ కి పులిస్టాప్ పెట్టవచ్చు.