శేఖర్ కమ్ముల నుండి మరో ప్రేమకథ!

శేఖర్ కమ్ముల నుండి మరో ప్రేమకథ!

 

టాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. 'హ్యాపీడేస్' వంటి యూత్ ఫుల్ సినిమాను తెరకెక్కించడంతో పాటు 'ఫిదా' వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీను ప్రేక్షకులకు అందించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఓ కథను సిద్ధం చేసుకుంటున్నాడు. కొద్దిరోజులుగా ఆయన 'లీడర్' సినిమాకు సీక్వెల్ తీస్తాడనే మాటలు వినిపించాయి. కానీ ఈసారి కూడా శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం.. శేఖర్ కమ్ముల యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నేపధ్యంలో నడిచే ఈ ప్రేమకథను విజయ్ కు వినిపించి మెప్పించాడని తెలుస్తోంది. గతంలో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో విజయ్ చిన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ అభిమానంతోనే శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్ అలానే పరశురామ్ వంటి దర్శకులతో కలిసి పని చేస్తున్నాడు. ఆ సినిమాలు పూర్తి చేసి శేఖర్ కమ్ములతో సెట్స్ పైకి వెళ్తాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి

మొన్న కామెడీ.. నిన్న హీరోయిజం.. రేపు డైరక్షన్!

ఎవరది ?

https://goo.gl/m58NHg

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page