ప్రభాస్ కెరీర్ లో మారో బారి బడ్జెట్ లో రూపొందుతున్న చిత్రం సాహో. ఈ సినిమా రిలీజ్ కోసం ఓ వైపు తెలుగు జనాలు అలాగే మరోవైపు నార్త్ జనాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ స్టిల్స్ తోనే సినిమాపై భారీ అంచనాలను రేపుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా హై లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. 

ఇప్పటికే సినిమా షూటింగ్ పనులన్నీ ఓ కొలిక్కి రాగ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మరికొన్ని రోజుల్లో ఫినిష్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే ఎవరు ఊహించని విధంగా సినిమా కోసం ఎంపిక చేసుకున్న సంగీత త్రయం శంకర్ ఏ హాసన్ లాయ్ లు సినిమా నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు సినిమా రిలీజ్ పై అనుమానాలు మొదలవుతున్నాయి. 

థమన్ - జిబ్రాన్ సాహో ఛాన్స్ కోసం పోటీ పడుతుండగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కూడా ఈ లిస్ట్ లో చేరినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని వీలైనంత త్వరగా ఫైనల్ చేయాలనీ చూస్తున్నారు. కుదిరితే థమన్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఉంచి మిగతా ఇద్దరిలో ఒకరిని సాంగ్స్ కోసం సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.