Suriya : ‘ఆకాశమే నీ హద్దురా’ తర్వాత హీరో సూర్య, డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!
‘ఆకాశమే నీ హద్దురా’తో హిట్ చిత్రాన్ని అందించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర.. తమిళ స్టార్ హీరో సూర్య కోసం మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డిటేయిల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya), కోలీవుడ్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara) కాంబినేషనల్ లో వచ్చిన తమిళ చిత్రం ‘సూరరై పొట్రు’ (Soorarai Pottru). ఈ చిత్రం ఎంతటి ఘన విషయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీ.ఆర్. గోపీనాథ్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు సుధా కొంగర. రియల్ లైఫ్ స్టోరీ కావడం, సూర్య అద్భుత నటనతో సౌత్ లో మంచి రెస్సాన్స్ లభించింది.
తెలుగులోనూ సూర్యకు మంచి మార్కెట్ ఉండటంతో ‘ఆకాశమే హద్దురా’అనే టైటిల్ తో ఇక్కడ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, రాధిక మదన్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. నిన్ననే సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ఇటీవల ఈటీ (ET)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య పెద్దగా హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ అప్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ రియలిస్టిక్ డైరెక్టర్ బాలా (Bala)తో కలిసి సూర్య 41వ చిత్రంలో నటించనున్నారు. మరోవైపు గూఢచర్యానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా బయోగ్రాఫికల్ డ్రామాను హీరో మాదవన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సైఫై చిత్రంలోనూ సూర్య కామియో అపియరెన్స్ ఇవ్వనున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. సూర్య, లేడీ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ఈ చిత్రం కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తెరకెక్కుతుందట. ఈసారి మరింత స్థాయిలో ఎమోషన్స్, ఛాలెంజెస్ ఉంటాయని, సబ్జెక్ట్ చాలా బలంగా ఉంటుందని సుధా తెలిపినట్టు సమాచారం. అయితే ఇప్పటికే హిందీలో రీమేక్ అవుతున్న ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని కూడా సుధా కొంగరనే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక... సూర్యతో నెక్ట్ మూవీని పట్టాలెక్కించనున్నారు.