అక్కినేని వారసుడు అఖిల్ నటించబోయే నాల్గవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశపరిచాయి. కానీసం గీతా ఆర్ట్స్ సంస్థతో అయినా తన అదృష్టం కలసి వస్తుందేమోనని అఖిల్ భావిస్తున్నాడు. 

ఈ నెలలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కానీ అఖిల్ కి హీరోయిన్ ని మాత్రం ఇంతవరకు ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ ఆ పనిలోనే ఉన్నాడు. కథకు అనుగుణంగా నటించగలిగే హీరోయిన్ కోసం జల్లెడ పడుతున్నాడు. ఇప్పటికే రష్మిక మందన, కియారా అద్వానీ లాంటి క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా మరో హీరోయిన్ అఖిల్ , బొమ్మరిల్లు ప్రాజెక్ట్ రేసులోకి వచ్చింది. 

బొమ్మరిల్లు భాస్కర్ ప్రస్తుతం నివేతా పేతురాజ్ పేరు కూడా పరిశీలిస్తున్నాడట. ఇది కాస్త ఆసక్తికరమైన వార్తే. ఎందుకంటే నివేతా వయసులో అఖిల్ కంటే రెండేళ్లు పెద్ద. కియారా అద్వానీ కూడా ఓ సంవత్సరం పెద్దే. అఖిల్ కొత్త సినిమా విషయంలో ఇలా ఏజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో అని ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

నివేతా పేతురాజ్ ఇటీవల వరుస విజయాల్ని సొంతం చేసుకుంటోంది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.