బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు (Bipasha Basu) తాజాగా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. భర్త కరణ్ సింగ్ - బిపాసా బసు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.  

బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు తాజాగా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. 43 ఏండ్లకు తొలిసారిగా బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా తన భర్త కరణ్ సింగ్ - బిపాసా బసు కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ ఈ తీపి కబురును పంచుకుంది. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిపాసా బసు కూడా తల్లికాబోతున్నట్టుగా ప్రకటించడంతో నార్త్ అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ స్టార్ కపుల్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

బిపాసా బసు 1996 నుండి 2015 వరకు ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. అప్పటి నుంచి 2002 వరకు నటుడు డినో మోరియాతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2002 నుండి 2011 వరకు జాన్ అబ్రహంతో కలిసి ఉన్నట్టుగా రూమార్లు వచ్చాయి. మాజీ నటుడు హర్మాన్ బవేజాతోనూ రిలేషన్ కొనసాగించి 2014లో బ్రేక్ చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత 2016 ఏప్రిల్ 30న తన సహనటుడు కరణ్ సింగ్ (Karan Singh)ను ప్రేమించి పెళ్లాడింది. 2015లో వచ్చిన ‘అలోన్’ చిత్రంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి చివరికి పెళ్లి పీటల వరకు వచ్చింది. 

పెళ్లి తర్వాత బిపాసా బసు సినిమాలకు గుడ్ బై చెప్పించింది. చివరిగా ‘అలోన్’ చిత్రంలోనే నటించింది. ఆ తర్వాత రెండేండ్ల కింద ‘డేంజరస్’ వెబ్ సిరీస్ తో తన అభిమానులను అలరించింది. ఏట్టకేళలకు పెళ్లైన ఆరేండ్లకు 43 ఏండ్ల వయస్సులో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది బిపాసా. ప్రస్తుతం బిపాసా మరియు కరణ్ తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా విషయం తెలుసుకొని ఎంతగానో సంతోషిస్తున్నారు. బిపాసా తెలుగులోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘టక్కరి దొంగ’ చిత్రంలో నటించింది. తెలుగులో ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది.