Asianet News TeluguAsianet News Telugu

Anjali: నితిన్ నియోజకవర్గానికి కొత్త కళ.. ఐటెం సాంగ్ తో తెలుగు బ్యూటీ మెరుపులు

నితిన్ ప్రస్తుతం నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంపై గట్టిగానే ఫోకస్ పెట్టాడు. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Anjali to shake legs with nithiin in macharla niyojakavargam
Author
Hyderabad, First Published Jul 3, 2022, 2:11 PM IST

యంగ్ హీరో నితిన్ గత ఏడాది మూడు చిత్రాలతో నటించాడు. రంగ్ దే, చెక్, మ్యాస్ట్రో చిత్రాలు గత ఏడాది విడుదలయ్యాయి. వీటిలో రంగ్ దే, మ్యాస్ట్రో చిత్రాలు పర్వాలేదనిపించగా.. చెక్ నిరాశ పరిచింది.  నితిన్ సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలమే అవుతోంది.   

దీనితో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంపై గట్టిగానే ఫోకస్ పెట్టాడు. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో యాక్షన్ డోస్ కూడా ఎక్కువగానే ఉండబోతోంది. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా మలిచేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. 

ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో అదిరిపోయే ఐటెం నంబర్ ఉంది. ఐటెం సాంగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు హీరోయిన్ అంజలి ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో చిందేయనుంది. ఐటెం సాంగ్ లో డాన్స్ చేస్తున్న అంజలి హాట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 

అంజలి ఐటెం సాంగ్ తో నితిన్ చిత్రానికి కొత్త కళ వచ్చిందనే చెప్పాలి. నితిన్, అంజలి కలసి చేసే కిర్రాక్ స్టెప్పులతో థియేటర్స్ మోతెక్కడం ఖాయం. అంజలి గతంలో అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. 

ఐటెం సాంగ్ కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా పేరు పరిశీలించినట్లు ప్రచారం జరిగింది. కానీ చివరకి మేకర్స్ అంజలిని ఫైనల్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios