తెలుగమ్మాయి అయినప్పటికీ అంజలికి తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. మధ్యలో నటుడు జైతో ప్రేమాయణం సాగించింది. పబ్లిక్ గా వీరిద్దరూ కలిసి కనిపించేవారు. అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.

దీంతో అంజలికి తన ప్రేమ సంగతి చెప్పాల్సిన అవసరం రాలేదు. అయితే తన బాయ్ ఫ్రెండ్ గురించి మీడియాలో ప్రశ్నిస్తే మాత్రం చిర్రుబుర్రులాడుతోంది ఈ బ్యూటీ. తాజాగా అంజలి నటించిన 'లిసా' సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చింది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడింది.

ఓ తమిళ హీరోతో మీరు ఇంతకముందు ప్రేమలో ఉన్నారంట కదా అని ప్రశ్నిస్తే దానికి అంజలి ఒకింత అసహనానికి లోనైంది. నేను ప్రేమలో ఉన్న సంగతి ఎవరికైనా చెప్పానా..? అంటూ రివర్స్ లు క్వశ్చన్ చేసింది. తాను చెప్పని ఏ విషయం గురించీ స్పందించనని తేల్చి చెప్పింది.

''నేను చెప్పని ఏ విషయానికి నేను బాధ్యత తీసుకోను.. ఏదైనా ఉంటే నేనే ప్రకటిస్తా.. నేను దాని గురించి మాట్లాడడం లేదంటే.. ఏమీ ప్రకటించలేదనే దానర్ధం'' అంటూ చెప్పుకొచ్చింది. 

తన గురించి మీడియాలో వచ్చే వార్తలను పెద్దగా చదవనని, కొన్నిసార్లు తన కుటుంబ సభ్యులు, కజిన్స్ ఆ వార్తలు చూసి కంగారు పడుతుంటారని తెలిపింది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నట్లు.. ఎలాంటి రిలేషన్షిప్ లో లేనని స్పష్టం చేసింది.