సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో టాలీవుడ్ కి దగ్గరైన అంజలి అప్పటి నుంచి కోలీవుడ్ లో ఒక లెవెల్లో కెరీర్ ని కొనసాగిస్తోంది. ఇక ఇప్పుడు ఈ సీనియర్ నటి డిజిటల్ మూవీస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అంజలి వెబ్ యాంథాలజీలో కనిపించనుందట. 

యాంథాలజీ అంటే ఒకే కాన్సెప్ట్ లో నలుగురు దర్శకులు డిఫరెంట్ కథలను తెరకెక్కిస్తారన్నమాట. గతంలోనే అంజలి డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు  రూమర్స్ వచ్చాయి. కొన్నిసార్లు ఆమె నో చెప్పినట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ఫైనల్ గా సీతమ్మ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న ఒక క్రైమ్ యాక్షన్ కథలో కనిపించనున్నట్లు కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. 

అయితే ఈ వెబ్ యాంథాలజీకి మొదట విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించనున్నాడు. పరువు హత్యలకు సంబందించిన కాన్సెప్ట్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ గా స్టోరీ కొండగుతుందట.  గౌతమ్‌ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్ వంటి డైరెక్టర్స్ కూడా కొన్ని కథలకు దర్శకత్వం వహించడానికి ఒప్పుకున్నారు.