నటిగా అప్పటివరకు చిన్న చిన్న రోల్స్ లో కనిపించిన అనీషా ఆంబ్రోస్ లో పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడంతో ఒక్కసారిగా ఆమెకి క్రేజ్ వచ్చేసింది. ఆ తరువాత ఆమెని తప్పించి కాజల్ ని తీసుకున్నారనుకోండి.

ఆ తరువాత 'మనమంతా', 'ఒక్కడు మిగిలాడు' వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ రీసెంట్ గాఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది. అయితే తన ఎంగేజ్మెంట్ విషయం ఇండస్ట్రీలో కూడా ఎవరికీ చెప్పలేదట. 

అతడి తక్కువ మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకొంది. తన చిన్నప్పటి స్నేహితుడు గుణ జక్క అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉన్న అనీషా ఇప్పుడు అతడితో పెళ్లికి రెడీ అవుతోంది.

గుణ వైజాగ్ కి చెందిన వ్యక్తి. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుంది. ఎంగేజ్మెంట్ ఈవెంట్ కి మాత్రం ఇండస్ట్రీ నుండి అనీషా స్నేహితురాలు బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ హాజరైనట్లు తెలుస్తోంది.