యువ సంగీత దర్శకుడు అనిరుద్ తన సినిమాలో పాడనని చెప్పాడని ఓ దర్శకుడు ఏకంగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అసలు విషయంలోకి వస్తే.. నటుడిగా కొన్ని సినిమాలలో నటించిన పొన్నుడి దర్శకుడిగా మారి 'సోమపాన రూప సుందరన్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

విష్ణుప్రియన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ ఐశ్వర్య దత్తా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఐశ్వర్య బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడంతో షూటింగ్ లో కొంత జాప్యం జరిగింది.

ఇది ఇలా ఉండగా.. అనిరుద్ ని ఈ సినిమాలో పాడమని సంప్రదించగా.. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా నో చెప్పేశాడు. దీంతో ఈ సినిమా దర్శకనిర్మాతల మధ్య కొన్ని విబేధాలు తలెత్తాయి. మనస్తాపం చెందిన దర్శకుడు పొన్నుడి నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు.

అయితే ఆయన సహాయ దర్శకులు వెంటనే హాస్పిటల్ లో చేర్చడంతో ఆయనకి ప్రాణాపాయం తప్పింది. ''అనిరుద్ తో పాట పాడిస్తానని మ్యూజిక్ డైరెక్టర్ అబ్బాస్ రఫీ మాట ఇవ్వడంతో సినిమా షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకున్నట్లు, కానీ ఆయన కుదరదని చెప్పడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు''  పొన్నుడి వెల్లడించారు.