అర్జున్ రెడ్డి మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అంతకు మించిన వివాదం రాజేసింది. కాగా ఆయన లేటెస్ట్ మూవీ యానిమల్ సైతం కాంట్రవర్సీకి దారి తీయవచ్చని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పడం విశేషంగా మారింది.
2017లో వచ్చిన అర్జున్ రెడ్డి దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ భారీ హిట్స్ నమోదు చేశాయి. ఈ రెండు చిత్రాలకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. విజయాలతో పాటు ఈ రెండు చిత్రాలు వివాదం రగిల్చాయి. ప్రేయసిని ప్రేమికుడు కొట్టడం, బూతులు మాట్లాడటం, లిప్ కిస్సులు... ఇలా పలు అంశాల మీద అభ్యంతరాలు లేచాయి. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి మూవీ మీద పెద్ద పెద్ద డిబేట్లు నడిచాయి. అలాగే బాలీవుడ్ లో కూడాను.
ఈ కాంట్రవర్సీ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. మూవీ మరింత సక్సెస్ అయ్యేందుకు దోహదం చేసింది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన రెండు చిత్రాలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. ఈ క్రమంలో యానిమల్ కూడా వివాదాస్పదం కానుందా అనే చర్చ అప్పుడే మొదలైంది. ఈ సందేహాన్ని ఇంటర్వ్యూలో యాంకర్ సందీప్ రెడ్డిని నేరుగా అడిగారు. కనీసం యానిమల్ మూవీ వివాదాలు సృష్టించదని భావించవచ్చా? అని అడగ్గా... సందీప్ రెడ్డి షాకింగ్ సమాధానం ఇచ్చారు.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ కి మించిన కాంట్రవర్సీ యానిమల్ క్రియేట్ చేసే అవకాశం కలదు. మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అంటే ఏమిటో యానిమల్ లో చూపించబోతున్నాను అన్నారు. సందీప్ రెడ్డి కామెంట్స్ చిత్ర వర్గాలను షాక్ కి గురి చేశాయి. యానిమల్ మూవీ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 11న ఐదు భాషల్లో విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. నేడు యానిమల్ చిత్ర ప్రీ టీజర్ విడుదల చేశారు. కపాలం మాస్క్ పెట్టుకొని ఉన్న గ్యాంగ్ హీరో రన్బీర్ మీద అటాక్ చేయగా, ఆయన ఊచకోత కోశారు. భయంతో పరుగులు తీయించారు. యానిమల్ మూవీ ప్రీ టీజర్ రక్తపాతాన్ని తలపించింది.
యానిమల్ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది. సీనియర్ నటుడు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేస్తున్నారు. టి సీరీస్ బ్యానర్లో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక రన్బీర్ కపూర్ గత చిత్రం బ్రహ్మాస్త్ర పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఆయన ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు. యానిమల్ రన్బీర్ హిట్ దాహం తీర్చే సూచనలు కలవు.
