Asianet News TeluguAsianet News Telugu

#Animal థియోటర్స్ లో మిషన్ గ‌న్,వాటే స్ట్రాటజీ


 సినిమాకి ఈ భారీ గన్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలవనుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.. కొన్ని ప్రధాన థియేటర్లలో ప్రేక్షకుల ప్రదర్శనార్థం దీనిని ఉంచాలని భావిస్తున్నారట 

Animal Ranbir Kapoor CONFIRMS 500 KG Machine Gun In Film Is not CGI But Real jsp
Author
First Published Nov 28, 2023, 4:53 PM IST


ఏదో ఒక వెరైటీ లేకపోతే జనం ఆ సినిమా గురించి మాట్లాడుకునే పరిస్దితి లేదు. ఇప్పుడు యంగ్ డైరక్టర్స్ కు ఆ విషయం తెలుసు. తమ సినిమాలో ఓ స్పెషాలిటీని, జనం మాట్లాడుకునే విధంగా డిజైన్ చేస్తున్నారు. అలా మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోయే యానిమల్ చిత్రంలో మిషన్ గన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఇప్పటికే యానిమల్  ట్రైలర్ చివర్లో ఓ మిషన్ గన్ ను రణ్ బీర్ వాడటం గమనించి వెర్రిత్తిపోతున్నారు. అయితే దాన్ని చూసి చాలా మంది గ్రాఫిక్స్ అని అనుకున్నారు. కానీ అది గ్రాఫిక్స్ గన్ కాదు. దాన్ని నాలుగు నెలలు కష్టపడి   రెడీ చేశారు. ఈ గన్ కోసం అచ్చమైన స్టీల్ ను వాడారు. దీని బరువు దాదాపు 500 కేజీలు ఉంటుందని యానిమల్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇది డైరెక్టర్ సందీప్ విజన్ కు తార్కణంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నాడు. ఈ విషయాన్ని రణబీర్ కన్ఫర్మ్ చేసారు. 

అలాగే ఆ మిషన్ గన్ తయారీకి అయ్యిన ఖర్చు 50 లక్షలు అని తెలుస్తోంది. దాంతో సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్న ఆ గన్ ని థియేటర్ లో ప్రదర్శనకు పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన దర్శక,నిర్మాతలకు ఉందిట. ముఖ్యంగా హైదరాబాద్ థియేటర్స్ లో  ఈ గన్ ని ప్రదర్శనకు పెడతారని, ఆ తర్వాత దాని ట్రాన్సపోర్ట్ ఫెసిలిటీ చూసుకుని మెట్రో సిటీస్ మల్టీ ఫ్లెక్స్ ల దగ్గర ఉంచబోతున్నట్లు సమాచారం. దాంతో సినిమాకు ఉచిత పబ్లిసిటీ లభిస్తుందని చిత్ర టీమ్ భావిస్తోందిట. జనాలు ఆ గన్ దగ్గర నిలబడి ఫొటోలు దిగటం వంటివి చేస్తే అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని, ఆ క్రమంలో సినిమాకు బజ్ రెట్టింపు అవుతుందని అనుకుంటున్నారట.  ప్రస్తుతం ఈ మిషన్ గన్ ముంబైలో ఉంది. త్వరలోనే దీనిని హైదరాబాద్ కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రణబీర్ కూడా ఈ సీన్ గురించి మాట్లాడుతూ.. సందీప్ వంగా ఈ సీన్ చెప్పినప్పుడు చాలా ఎక్స్‌జైట్ ఫీల్ అయ్యినట్లు చెప్పుకొచ్చారు. ఆ సీన్ చాలా బాగా వచ్చిందని తెలియజేశారు. ఆ సీన్ లో రణబీర్ ఒక భారీ మెషిన్ గన్ తో ఫైర్ చేస్తూ ఉన్నారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందో అని అందరూ అంచనాలు పెంచుకుంటున్నారు. 

ఇక బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కింది.  తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ కావడంతో.. యానిమల్ పై హైప్ ఉంది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.  

Follow Us:
Download App:
  • android
  • ios