Asianet News TeluguAsianet News Telugu

‘యానిమల్’ ఫస్ట్ సింగిల్ రెడీ.. రిలీజ్ ఎప్పుడు? లిప్ లాక్ తో రొమాంటిక్ పోస్టర్

రన్బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగ చిత్రం ‘యానిమల్’ నుంచి క్రేజీ అప్డేట్ అందింది. మూవీ ఫస్ట్ సింగిల్ ను రెడీ చేశారు. తాజాగా రొమాంటిక్ పోస్టర్ ను వదిలి అప్డేట్ అందించారు. సాంగ్ పై హైప్ క్రియేట్ అయ్యింది.

Animal movie first single Hua Main announcement NSK
Author
First Published Oct 10, 2023, 11:21 AM IST

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘యానిమల్’ను సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor)  ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయిక. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే యూనిట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తోంది. ఇప్పటికే రన్బీర్ కపూర్, రష్మిక మందన్న లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యి మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. టీజర్ కూడా దుమ్ములేపింది. 

సినిమా నుంచి అందుతున్న ప్రతి అప్డేట్  అంతకంతకూ అంచనాలను పెంచుతూ పోతోంది. ఈ క్రమంలో తాజాగా మ్యూజిక్ పైనా అప్డేట్స్ ను అందించడం ప్రారంభించారు. కొద్ది సేపటి కింద రొమాంటిక్ పోస్టర్ ను వదులుతూ ఫస్ట్ సింగ్ పై అప్డేట్ అందించారు. ఐదు భాషల్లో ఈ సాంగ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్ తో రాబోతోంది. రేపు (Tomorrow)  ఈ బ్యూటీఫుల్ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుందని చెప్పారు. పక్కా టైమ్ అని ప్రకటించలేదు. అయితే, ఈ అప్డేట్ తో వదలిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆకాశంలో లిప్ లాక్ చేసుకుంటున్న రన్బీర్, రష్మీక మందన్నను చూపించారు. ఒక్క పోస్టర్ తోనే సాంగ్ పై ఆసక్తి నెలకొంది. 

ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి మొదలైనవారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిస్తుండటం విశేషం. వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios