Asianet News TeluguAsianet News Telugu

#Animal: బడ్జెట్ ఎంత, నిర్మాతలకు ఎన్ని కోట్లు లాభం

 ధర్డ్ పార్టీకి  ఈ సినిమాని అమ్మకుండా అడ్వాన్స్ లు తీసుకుని  ఇండిపెండెంట్ గా రిలీజ్ చేసారు. ఇక ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లు వసూలు చేసింది.  

Animal earned a profit of 300 crore for the producers jsp
Author
First Published Dec 19, 2023, 3:16 PM IST

బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌బీర్ - తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్ర‌మే... ‘యానిమ‌ల్‌ (Animal movie)భాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్న సంగతి తెలిసిందే. సలార్ థియేటర్స్ లోకి వచ్చేదాకా ఈ భాక్సాఫీస్ కుంభవృష్టికు అడ్డుకట్ట పడేలా లేదు.నార్త్,  సౌత్  తేడా లేకుండా ఈ సినిమా హవా కనిపిస్తోంది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా  మొదటి రోజు నుంచే  సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్స్ తో బాలీవుడ్లో ఇదివరకు ఉన్న రికార్డ్స్ అన్ని చల్లాచెదురు అయిపోయాయి.షారుక్ 'జవాన్' రికార్డ్ ని 'యానిమల్' బ్రేక్ చేసింది. ఈ నేఫధ్యంలో ఈ సినిమాకు ఎంత పెట్టారు...ఎంత లాభం నిర్మాతకు రానుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం అయ్యింది. అందులో 140 కోట్లు నాన్ థియేటర్ రైట్స్ తో వెనక్కి వచ్చాయి. అంటే 60 కోట్లు థియేటర్ నుంచి వస్తే రికవరీ అయ్యినట్లే .  ధర్డ్ పార్టీకి  ఈ సినిమాని అమ్మకుండా అడ్వాన్స్ లు తీసుకుని  ఇండిపెండెంట్ గా రిలీజ్ చేసారు. ఇక ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లు వసూలు చేసింది.  దాంతో ఈ చిత్రానికి 350 కోట్లు షేర్ వచ్చింది. ఫుల్ రన్ లో 400 కోట్లు షేర్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 60 కోట్లు థియేటర్ నుంచి వస్తే రికవరీ అయ్యినట్లే అనుకుంటే ఈ సినిమా 400 కోట్ల షేర్ తెస్తోంది. అంటే పబ్లిసిటీ ఖర్చులు, వడ్డీలు, కమీషన్స్, మిగతా ఖర్చులు అన్నీ 40 కోట్లు అనుకుంటే ఆ మొత్తం పోను 300 కోట్లు నిర్మాతలకు మిగులుతుంది. అంటే యానిమల్ చిత్రం నిర్మాతలకు 300 కోట్లు లాభం తెచ్చి పెట్టిందన్నమాట.
 
యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే యూత్ కు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios