`ఎఫ్ 2- ఫన్ & ఫ్రస్టేషన్` సంక్రాంతి బరిలో ఏకైక బ్లాక్ బస్టర్ అన్న టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ `వినయ విధేయ రామ` ఎన్టీఆర్ - కథానాయకుడు చిత్రాలను బాక్సాఫీస్ రేసులో వెనక్కి నెట్టి హిట్ కొట్టడటంతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యిపోయారు ఈ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి.  మహేష్ బాబు సైతం ఈ సినిమాని మెచ్చుకున్నారు. దాంతో అనీల్ ప్రస్తుతం మహేష్ కోసం  ఓ స్క్రిప్టును రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ నేపధ్యంలో ఓ విషయం బయిటకు వచ్చింది. మహేష్ తో పనిచేయటం అనీల్ రావిపూడికు కొత్తేమీ కాదు. 

రైటర్ గా కెరీర్ ప్రారంభించిన అనీల్ రావిపూడి పటాస్ చిత్రంతో దర్శకుడిగా మారారు. ‘పటాస్’ చిత్రం సమయంలోనే  అనీల్ రావిపూడి మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ చిత్రంకు రచయితగా వర్క్ చేసారు. ఆగడు చిత్రం ఇంటర్వెల్ వరకూ పూర్తి అయ్యేసరికి  పటాస్ ఆఫర్ వచ్చిందని దాంతో ఆగడు సెకండ్ హాఫ్ కు అనీల్ రావిపూడి వర్క్ చేయలేక పోయాడట.  దాంతో సెకండాఫ్ ని శ్రీను వైట్ల స్క్రిప్టు రాసుకున్నారు. 

మొదట  ‘ఆగడు’ చిత్రం సెకండ్ హాఫ్ ను తన పటాస్ చిత్రం తరహాలో అనీల్ రావిపూడి అనుకున్నాడట. కాని ఈలోపు పటాస్ లో ఛాన్స్ రావడంతో తన ఫన్నీ ఐడియాలు, సీన్స్ మొత్తం కూడా ఆ చిత్రానికి ఇంప్లిమెంట్ చేశాడట. శ్రీనువైట్ల తన సొంత ఐడియాస్ తో ఆగడు చిత్రాన్ని పూర్తి చేశాడు. అయితే  ఆగడు  డిజాస్టర్ అయ్యింది. సెకండ్ హాఫ్ కు కూడా అనీల్ రావిపూడి వర్క్ చేసి ఉంటే ‘ఆగడు’ చిత్రం వేరేగా  ఉండేదేమో.

బాక్స్ ఆఫీస్:అత్యధిక లాభాలను అందించిన సినిమాలు (షేర్స్అప్డేట్)