బాలయ్యతో భగవంత్ కేసరి అనే చిత్రం చేస్తున్నారు. ఈసినిమా తర్వాత అనీల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది.
స్టార్స్ తో ఫన్ సినిమాలు తీసే కామెడీ డైరక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు ఓ రేంజిలో డిమాండ్ ఉంది. రాజమౌళి, కొరటాల తర్వాత ఫ్లాఫ్ లు లేకుండా వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈయన. ముఖ్యంగా ఆయన చేసిన అన్ని సినిమాలు నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఈయన ఎఫ్3 సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు బాలయ్యతో భగవంత్ కేసరి అనే చిత్రం చేస్తున్నారు. ఆ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈసినిమా తర్వాత అనీల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ... అనీల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే 2024లో చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబో ప్రారంభం అవుతుంది. చిరంజీవి ఫ్యాన్స్ నచ్చే ఎలిమెంట్స్ తో పూర్తి మాస్ అప్పీల్ తో తన స్టైల్ ఫన్ తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. చిరంజీవి కూడా అనీల్ రావిపూడి తో చేయాలని గతంలో కూడా అన్నారు.
ఆ మధ్యన ఒక మీడియా సంస్థకు అనీల్ రావిపూడి మాట్లాడుతూ . చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తనకు నాగార్జున బాలకృష్ణ చిరంజీవి లతో సినిమాలు తీయాలని తన కోరిక అని చెపుతూ బాలయ్యతో సినిమా చేసే అవకాశం తనకు వచ్చినప్పటికీ నాగార్జున, చిరంజీవి లతో సినిమాలు చేసే అవకాశం గురించి ఎదురు చూస్తున్నాను అంటూ కామెంట్ చేసాడు.
ఇదే సందర్భంలో తనకు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి ఒక భారీ ఫ్యాంటసీ మూవీని ‘మాయాబజారు’ లాంటి ఒక గొప్ప పౌరాణికాన్ని తీయాలని ఉంది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. గతంలో చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మూవీ సీక్వెల్ లో నటిస్తే చూడాలని ఉంది అంటూ తన కోరికను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. మరి అలాంటిదేమన్నా ప్లాన్ చేస్తున్నారేమో చూడాల్సిందే.
