ఈ సారి ముగ్గురు: ‘ఎఫ్‌-3’ లో మరో హీరో..ఎవరంటే

ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ తెరకెక్కించబోతున్నట్టు అనిల్‌ రావిపూడి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం. ‘ఎఫ్‌2’లో కనిపించిన వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ ఇందులో కనిపించనున్నారు. వారికి జోడీగా తమన్నా, మెహరీనే కనిపిస్తారు. 

Anil Ravipudi To Cast Gopichand in f3? jsp

 విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలుగా వెండితెరపై మరోసారి నవ్వుల వర్షం పూయించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు అనిల్‌ రావిపూడితో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ‘ఎఫ్‌-2’. 2019లో విడుదలైన ఈ సినిమాకు స్వీకెల్‌గా ‘ఎఫ్‌-3’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం వెంకటేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఎఫ్‌-3’ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను చిత్ర టీమ్ విడుదల చేసింది. 

‘‘ఎఫ్‌-2’లో భార్యలపై ఫ్రస్ట్రేషన్‌తో ఉన్న మన హీరోలు ‘ఎఫ్‌-3’లో డబ్బు వల్ల ఫ్రస్ట్రేషన్‌కు గురి కానున్నారు. కో బ్రదర్స్‌ వెంకీ, వరుణ్‌ జీవితాల్లో మరింత ఫన్‌ నింపుదాం’ అని చిత్ర టీమ్ పేర్కొంది. ‘ఎఫ్‌-2’లో నటించిన తమన్నా, మెహరీన్‌.. ఈ సీక్వెల్‌లోనూ సందడి చేయనున్నారు. అదే సమయంలో ఈ ఎఫ్ 3లో మరో హీరోకు అవకాసం ఉందని తెలుస్తోంది. 

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అనీల్ రావిపూరి ఆ హీరో కోసం ఆల్రెడీ సెర్చింగ్ ఫినిష్ చేసి టచ్ లోకి వెళ్లాడంటున్నారు. ఆ హీరో మరెవరో కాదు గోపీచంద్. చేతిలో సరైన హిట్ అనేది లేని గోపిచంద్ సైతం ఈ ఆఫర్ కు సరే అని అన్నారట. హిట్ సీక్వెల్ లో ఉంటే తనకు హిట్ వస్తుందని నమ్ముతున్నారట. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

గోపీచంద్‌.. సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్‌ కోచ్‌గా కనిపించనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం నేడు సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘సీటీమార్‌’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌కు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్నారు.

 ఇప్పటికే సంపత్‌నంది-గోపీచంద్‌ కలయికలో ‘గౌతమ్‌నంద‌’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. 2017లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ‘సీటీమార్‌’ సినిమాతో మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఇటు గోపీచంద్‌తోపాటు అటు దర్శకుడు సంపత్‌ నంది కూడా భావిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios