భగవంత్ కేసరి కలెక్షన్స్ ఫేక్ అంటూ విమర్శలు.. అనిల్ రావిపూడి సమాధానం ఏంటంటే..
అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన తొలి చిత్రం ఇదే.
అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన తొలి చిత్రం ఇదే. శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
ముఖ్యంగా ఈ చిత్రంలో అనిల్ రావిపూడి ఆడపిల్లల గురించి ఇచ్చిన మెసేజ్ అందరికీ చేరువవుతోంది. అయితే కొంత ఈ చిత్రంపై మిక్స్డ్ టాక్ కూడా ఉంది. అయినప్పటికీ భగవంత్ కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. అయితే చిత్ర యూనిట్ చెబుతున్న కలెక్షన్స్ నంబర్స్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తొలివారంలోనే భగవంత్ కేసరి చిత్రం 112 కోట్లు రాబట్టినట్లు ప్రకటించారు. వస్తావ నంబర్స్ ఆ స్థాయిలో లేవని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలి వారంలో ఈ చిత్రం 70 నుంచి 80 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు చెబుతున్నారు. సినిమాకి హైప్ తీసుకురావడం కోసమే వాస్తవ నంబర్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వేసి ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఫేక్ కలెక్షన్స్ అంటూ ఎదురవుతున్న విమర్శలపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఎలాంటి ఫేక్ కలెక్షన్స్ తాము ప్రకటించలేదని అనిల్ రావిపూడి అన్నారు. భగవంత్ కేసరి చిత్ర కలెక్షన్స్ గురించి తాము వేస్తున్న నంబర్స్ చాలా జెన్యూన్ అని అన్నారు. తాము వేస్తున్న కలెక్షన్స్ జెన్యూన్ అనేది ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టే అర్థం చేసుకోవచ్చు అని విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
భగవంత్ కేసరి సక్సెస్ టూర్ లో భాగంగా అనిల్ రావిపూడి మీడియాతో ఈ కామెంట్స్ చేశారు. వైజాగ్, ఏలూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భగవంత్ కేసరి చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది. శ్రీలీల కూడా సక్సెస్ టూర్ లో భాగం అయింది. తాజాగా అనిల్ రావిపూడి, శ్రీలీల ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు.