అనిల్ రావిపూడి - మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'సరిలేరు నీకెవ్వరు!'సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే విజయ్ శాంతి సినిమాలో చేసే రోల్ పై భారీ అంచనాలు రేపుతుండగా సినిమాలో మరో ముఖ్యమైన రోల్ లో నటకీరిటి మెప్పిస్తాడని దర్శకుడు తెలిపాడు. 

ఎర్రచీర అనే సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న దర్శకుడు అనిల్ రాజేంద్రప్రసాద్ గురించి మాట్లాడుతూ.. నేను ఆయన్ను ఇష్టంగా డాడీ అని పిలుచుకుంటాను. నా సినిమాల్లో ఆయన చాలా మంచి పాత్రలు చేశారు. సుప్రీమ్ - రాజా ది గ్రేట్ - F2 ఇలా నా ప్రతి సినిమాలో ఆయన ఉన్నారు. 

నెక్ట్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఆయన చేయబోయే పాత్ర అద్భుతంగా ఉంటుంది. మహేష్ బాబు - రాజేంద్ర ప్రసాద్ గారి కెమిస్ట్రీ - కామిక్ టైమింగ్ గాని అందరికి నచ్చుతుంది. సుప్రీమ్ సమయంలోనే రాజేంద్రప్రసాద్ గారు నాకు ఒక వజ్రాయుధం అని చెప్పను. అదే విధంగా ప్రతి సినిమాలో ఆయనకు మంచి రోల్ ఉండేలా చూసుకుంటానని అనిల్ మాట్లాడారు.