టాలీవుడ్ లో వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ ఇటీవల F2 సినిమాతో హిట్ అందుకొని రాజా ది గ్రేట్ సినిమా అనంతరం నాలుగో హిట్ కొట్టేశాడు. ఇకపోతే ఈ సుప్రీమ్ డైరెక్టర్ నెక్స్ట్ బాలకృష్ణను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

కెరీర్ మొదట్లోనే పటాస్ అనంతరం నందమూరి బాలకృష్ణ కోసం 'రామారావు గారు' అనే ఒక కథను సెట్ చేసుకున్న అనిల్ కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్టును తెరకెక్కించలేకపోయాడు'. అయితే ఇప్పుడు సక్సెస్ ట్రాక్ లో ఉండటంతో అతనికి బాలకృష్ణ నుంచి కాల్ వచ్చినట్లు సమాచారం. రీసెంట్ గా కథపై చర్చలు జరిపిన బాలయ్య బోయపాటి సినిమా అనంతరం అనిల్ తో సినిమా చేయనున్నట్లు టాక్. 

ప్రస్తుతం మహానాయకుడు సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య వీలైనంత త్వరగా  బోయపాటితో కొత్త సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కూడా ఒకేసారి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.