వ‌రుసగా భ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇప్పుడు సమర్పకుడు గానూ మారారు. ఆయన స‌మ‌ర్ప‌ణ‌లో గాలి సంప‌త్ ప్రారంభ‌మైంది. ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన అనిల్ రావిపూడి మిత్రుడు ఎస్.క్రిష్ణ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  త‌న మిత్ర‌డు ఎస్‌. కృష్ణ కోసం అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తూ  స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అంతే కాకుండా క్రియేటివ్ సైడ్ ఈ చిత్రానికి అనిల్ రావిపూడి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ బ్యాక్ బోన్ లాగా నిలబడుతున్నారు.  న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు.   

అనిల్ రావిపూడి మాట్లాడుతూ - " ఈ సినిమాకు అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాయి శ్రీ‌రామ్ కెమెరామెన్. అలాగే మిర్చి కిర‌ణ్ డైలాగ్స్ రాస్తున్నారు.  నేను ఈ సినిమాకు మెంట‌ర్‌గా ఉంటున్నాను. నా సినిమాల‌న్నింటికీ కో-రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన అనీష్ అద్భుత‌మైన క‌థ రాశాడు. ఎక్స్‌ట్రార్డిన‌రీ స్క్రిప్ట్‌. స‌బ్జెక్ట్ న‌చ్చి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నాను. ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో పాటు మంచి ఎమోష‌న్ కూడా ఉంటుంది. డెఫినెట్‌గా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను.  ఈ చిత్రం, తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ ను ప్రెజెంట్ చేయబోతోంది. తండ్రీ కొడుకుల మద్య జ‌రిగే బ్యూటిఫుల్ జ‌ర్నీఈ సినిమా. త‌ప్ప‌కుండా మిమ్మ‌లంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది`` అన్నారు.

న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో విష్ణుకి ఫాద‌ర్‌గా గాలి సంప‌త్ అనే క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. ఈ మ‌ధ్య‌ కాలంలో నా మీద రాసిన ఒక అద్భుత‌మైన క్యారెక్ట‌ర్ ఇది. ఈ మూవీ మంచి విష‌యం ఉన్న క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా ఉండ‌బోతుంది`` అన్నారు.
  
న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,  స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి, ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌, సంగీతం: అచ్చు రాజ‌మ‌ణి, ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఎమ్‌, మాట‌లు: మిర్చి కిర‌ణ్‌, లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్ర్తి, ఫైట్స్‌: న‌భ‌, కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను, మేక‌ప్‌: ర‌ంజిత్‌, కాస్టూమ్స్‌: వాసు, చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు.  సమ‌ర్ప‌ణ‌: అనిల్ రావిపూడి, నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: అనీష్ కృష్ణ‌.