వెంకీ - అనిల్ రావిపూడి బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. మూడోసారి వీరి కాంబోలో VenkyAnil3 ప్రాజెక్ట్ రాబోతోంది. దీనిపై తాజాగా అధికారికంగా అప్డేట్ అందించారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) - వెంకటేశ్ దగ్గుబాటి (Venkatesh Daggubati) కాంబినేషన్ మరోసారి రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ‘ఎఫ్2, ఎఫ్3’ విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందని అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో ముచ్చటగా మూడోసారి సెట్ అయ్యింది. చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా తెలుగు వారికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ VenkyAnil3 ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ ప్రాజెక్ట్ ను SVC58గా నిర్మించబోతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మేకర్స్ వెల్లడించారు. 

ఈ చిత్ర కథ ఒక మాజీ పోలీసు, అతని మాజీ ప్రేయసి, అతని భార్య చుట్టూ తిరిగుతుందని, ఇదొక ట్రై యాంగిల్ లైవ్ స్టోరీ అని.. పైగా క్రైమ్ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ వెల్లడించారు. శ్రీష్ నిర్మాత కాగా, దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. త్వరలో ఈ చిత్రం అఫీషియల్ గా ప్రారంభం కానుంది. 2025 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా హీరోయిన్లు, ఇతర కాస్ట్ అండ్ క్రూపై అప్డేట్స్ రావాల్సి ఉంది. 

Scroll to load tweet…