ఆమె చెప్పేది నిజమైతే నిరూపించాలి.. శ్రీరెడ్డిపై హీరోయిన్ కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 11, Aug 2018, 10:34 AM IST
andrea comments on sri reddy issue
Highlights

ఇండస్ట్రీలో తనకు కాస్టింగ్ కౌచ్ వంటి పరిస్థితులు ఎదురుకాలేదని ఒకవేళ ఎవరికైనా ఎదురుపడితే ధైర్యంగా బయటపెట్టాలని అంటోంది నటి ఆండ్రియా

ఇండస్ట్రీలో తనకు కాస్టింగ్ కౌచ్ వంటి పరిస్థితులు ఎదురుకాలేదని ఒకవేళ ఎవరికైనా ఎదురుపడితే ధైర్యంగా బయటపెట్టాలని అంటోంది నటి ఆండ్రియా. సింగర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోయిన్ గా మారిన ఆండ్రియా మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే కాస్త భిన్నంగా వ్యవహరిస్తుంటుంది. తనకు నచ్చినట్లుగా జీవిస్తూ.. నచ్చిన కథల్లోనే నటిస్తూ ప్రత్యకమైన గుర్తింపు సంపాదించుకుంది.

తాజాగా ఆమె నటించిన 'విశ్వరూపం-2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఇందులో ఆండ్రియా పాత్రకు ప్రసంశలు దక్కుతున్నాయి. మొదట్లో కాలక్షేపం కోసం సినిమాల్లో నటించానని కానీ విశ్వరూపం సినిమాలో నటించిన తరువాత సామజిక బాధ్యత ఎక్కువైందని ఆండ్రియా వెల్లడించింది. ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అలానే శ్రీరెడ్డిలకు సంబంధించి ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

దీనికి సమాధానంగా.. 'శ్రీరెడ్డి చెప్పేది నిజమైతే.. వాటిని బయటపెట్టడానికి చాలా ధైర్యం కావాలి. నాకైతే ఇప్పటివరకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా బయటపెట్టడం కరెక్ట్. దానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన 'వడచెన్నై' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  

loader