కరీనా, సైఫ్ లకు బుల్లి పటౌడి ఖాన్

and its a baby boy for saif kareena
Highlights

  • సైఫ్ ఆలీ ఖాన్, కరీనా దంపతులకు మగబిడ్డ జననం
  • ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో జన్మనిచ్చిన కరీనా
  • బిడ్డకు తైమూర్ ఆలీ ఖాన్ అని నామకరణం చేసినట్లు ప్రకటన

బాలీవుడ్ తారలు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ దంపతులకు కొడుకు పుట్టాడు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 7.30 గంటలకు కరీనా పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు కరీనా స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఒక ట్వీట్ చేసారు. ‘కరీనా మగ బిడ్డకు జన్మనిచ్చిందని, నాకు చాలా ఆనందంగా ఉంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అలాగే సైఫ్, కరీనా దంపతులు కూడా ఒక ప్రకటనను విడుదల చేసారు. తమకు కొడుకు పుట్టాడని, ఈ అద్భుత ఘట్టాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. బాబుకి తైముర్ అలీఖాన్ పటౌడీ అని పేరుపెట్టినట్లు కూడా వెల్లడించారు. గత తొమ్మిది నెలలుగా తమను అర్థం చేసుకుని, అండగా నిలిచిన మీడియాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తమ అభిమానులు, శ్రేయోభిలాషులు వారి ప్రేమను ఇలాగే కొనసాగించాలని కోరారు. అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు.. ప్రేమతో సైఫ్, కరీనా అని ప్రకటనలో పేర్కోన్నారు. 

కాగా, సైఫ్, కరీనాకు తైమురు తొలి సంతానం. సైఫ్ అలీఖాన్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. తన మొదటి భార్య అమృతా సింగ్‌కు పుట్టిన వీరి పేర్లు సారా, ఇబ్రహీం.

loader