సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకోవాలని ఉందట.. టాలీవుడ్ యంగ్ యాంకర్ విష్ణు ప్రియకు. ఆకోరికను తాజాగా ఓ షోలో వెల్లడించింది. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా..? 

టాలీవుడ్ లో.. హీరోగా,, విలన్ గా ,,, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించాడు జేడి చక్రవర్తి. శివ, మనీ, గులాబీ, సత్య.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన JD చక్రవర్తి.. ఆతరువాత సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం మళ్లీ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ హడావిడి చేస్తున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. 

తెలుగులోని పలు సినిమాల్లో, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు జేడీ చక్రవర్తి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో JD చక్రవర్తి అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆయన నటించిన ఓ వెబ్ సిరీస్ లో యాంకర్ విష్ణు ప్రియ కూడా నటించింది. దాంతె ఈ స్టార్ సీనియర్ హీరోపై మనసు పారేసుకున్నా ఆమె.. జేడీపై తన ప్రేమను వ్యాక్త పరిచింది.

యాంకర్ విష్ణుప్రియ రీసెంట్ గా ఓ షోలో మాట్లాడుతూ JD చక్రవర్తి అంటే ఇష్టం అని, అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని, వాళ్ళ అమ్మని కూడా ఒప్పిస్తా అని, JD చక్రవర్తిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్పింది. దీంతో విష్ణు ప్రియ వ్యాఖ్యలు సోషల్ మీడియాల వైరల్ గా మారాయి.ఇక తాజాగా ఆమె వ్యాక్యలపై తాజాగా స్పందించారు JD చక్రవర్తి. ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు. 

JD చక్రవర్తి మాట్లాడుతూ.. ఇటీవల నేను, విష్ణుప్రియ కలిసి ఓ సిరీస్ లో నటించాం. అది త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి షూట్ చేశాం. ఆ సమయంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అన్నారు. అది ప్రేమ కాదు. ఇక ఆ సిరీస్ డైరెక్టర్ కూడా నాతో ఇంకా బాగా విష్ణుప్రియ నటించాలని తనని నా సినిమాలను చూడమన్నాడు. అలా ఆమె నా క్యారెక్టర్స్ తో ప్రేమలో పడింది. అంతే తప్ప అది మీరనుకునే ప్రేమ కాదు. మా ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఉంది అని అన్నారు.